Damodar Rajanarsimha: రాష్ట్రంలో ప్రతి ఏటా 50 వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ (Damodar Rajanarsimha) ప్రకటించారు. ఆయన బసవతారకం హాస్పిటల్ (Basavatarakam Hospital) 25వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సిల్వర్ జూబ్లీ సందర్భంగా బసవతారకం (Basavatarakam Hospital) డాక్టర్లు, (doctors) సిబ్బంది, మేనేజ్‌మెంట్‌కు శుభాకాంక్షలు తెలిపారు (Cancer) క్యాన్సర్‌తో మృతి చెందిన తన భార్య బసవతారకం పేరిట (NTR) ఎన్టీఆర్ 25 ఏళ్ల కిందట ఈ హాస్పిటల్ ప్రారంభించారన్నారు.
Also Read: Telangana: ఒక్కొక్కరికి నెలకు రూ.2,016.. సర్కారు గుడ్ న్యూస్
ఈ దవాఖానలో లక్షల మంది క్యాన్సర్ (Cancer) పేషెంట్లకు చికిత్స చేశారని చెప్పారు. ఎన్టీఆర్ (NTR) ఐకానిక్ లీడర్‌తో పాటు లెజెండరీ యాక్టర్ అని, సినిమా, సామాజిక సేవకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చేవారని గుర్తు చేశారు. క్యాన్సర్ (Cancer)సమస్య దేశవ్యాప్తంగా పెరుగుతున్నదని, దీని వలన కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందన్నారు. ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తేనే ఈ వ్యాధిని నయం చేయగలమని చెప్పారు. పేద పేషెంట్లకు సేవలు అందిస్తున్న బసవతారకం వంటి హాస్పిటళ్లకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ (NTR) స్థాపించిన ఈ హాస్పిటల్‌ను నడిపిస్తూ, పేదలకు సేవలు అందిస్తున్న బాలకృష్ణకు (Bala krishna)అభినందనలు తెలియజేశారు.
Also Read: Minister Seethakka: పేదరిక నిర్మూలనే లక్ష్యం.. ఆరు వేల కుటుంబాలకు సహాయం!