BRS: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలకు గులాబీ సన్నద్ధం అవుతోంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నం ముమ్మరం చేసింది. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతుంది. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు పార్టీ అధిష్టానం ఇన్ చార్జులను నియమించింది. అయితే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు కొంత స్తంభించడంతో మళ్లీ యాక్టీవ్ చేసే పనిలో నిమగ్నమైంది. డివిజన్ల ఇన్ చార్జులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
Also Read: Duddilla Sridhar Babu: తెలంగాణ ఏఐ క్యాపిటల్‌గా మారటానికి జాగర్ గ్లోబల్ సెంటర్ కీలక పాత్ర!
నేతలకు దిశానిర్దేశం
గ్రేటర్ హైదరాబాద్(Hyderabad) లో పట్టును నిలుపుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ(BRS Party)సన్నద్ధమవుతోంది. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటి మళ్లీ మేయర్ పీఠంను కైవసం చేసుకోవాలంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో డివిజన్లలోని పార్టీ ఇన్ చార్జులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, ప్రజలకోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తదితర వివరించాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, వైఫల్యాలను ఎత్తి చూపాలని అది కలిసి వస్తుందని, సునాయసంగా గెలుపొందవచ్చని నేతలకు సూచించారు.
నియోజకవర్గంలో కులాల వారీగా సమావేశాలకు సిద్ధమవుతున్నారు. ఆయా కులాలకు చెందిన నేతలను ఇన్ చార్జులుగా నియమించి వారిని మాటరింగ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరోవైపు మైనార్టీ, యాదవ, కమ్మ, మున్నూరు కాపు, ఇలా పలు కుల సంఘాలతో త్వరలోనే భేటీ కానున్నట్లు సమాచారం. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో ప్రచారం స్పీడ్ పెంచడం, మంత్రులు పాల్గొంటుండటంతో బీఆర్ఎస్ సైతం అదేస్థాయిలో ముందుకెళ్లాలని ప్లాన్ చేస్తుంది. కేడర్ లో జోష్ నింపే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు తాము ఉన్నామనే భరోసా ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ భవన్ లో ప్రత్యేక భేటీ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల(ubilee Hills By Election)పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ల ఇన్ చార్జులతో ప్రత్యేక భేటీ నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ లిస్టుతో ప్రతి ఓటర్ తో భేటీ కావాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ నియోజకవర్గ నేతలంతా కాలనీల వారీగా సమావేశాలు నిర్వహించాలన్నారు. అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశంలు చేపట్టాలని, 100మంది ఓటర్లకు ఒక ఇన్ చార్జీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎల్. రమణ, ఎమ్మెల్యే ముఠాగోపాల్,మాజీ మంత్రి మహమూద్ అలీ, నాయకులు జయసింహ, అజంఅలీ, పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు పాల్గొన్నారు.
Also Read: Sammakka-Saralamma Jatara: తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా సమ్మక్క సారక్క జాతర