BRS ( image CREDIT: TWITTER)
Politics

BRS: నివురుగప్పిన నిప్పులా గ్రూపులు.. మెజార్టీ ఎలా?

BRS: బీఆర్ఎస్‌కు స్థానిక ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 20 నెలలు అవుతున్నప్పటికీ పార్టీ పటిష్టతపై దృష్టి సారించలేదు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు కమిటీలు వేయలేదు. పార్టీకోసం పనిచేస్తున్నవారికి కనీసం కమిటీల్లోనైనా స్థానం లభిస్తుందని, గుర్తింపు ఇస్తుందని ఎదురుచూస్తున్న నేతలకు నిరాశే ఎదురవుతుంది. ఈ తరుణంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా ముందుకు సాగి మెజార్టీ స్థానాల్లో విజయం సాధిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కనీసం నేతలను పిలిచి మాట్లాడటం లేదని, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ పరిణామాలు అన్నీ స్థానిక ఎన్నికల్లో పార్టీకి అగ్ని పరీక్షగా మారనున్నాయి.

కేసీఆర్ సీఎం కావాలంటే..
నియోజకవర్గాల్లోని మండలాల వారీగా పార్టీ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తోంది. అయితే ఈ ఎన్నికలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు కీలకం కానున్నాయి. పార్టీ సైతం గ్రామస్థాయిలో ఏమేరకు పటిష్టంగా ఉందనేది కూడా ఈ ఎన్నికలతో స్పష్టమవుతోంది. మెజార్టీ సీట్లలో విజయం సాధిస్తే ఇప్పటివరకు పార్టీ కేడర్‌లోని నైరాశ్యం పోయి నూతనోత్సాహం వస్తుంది. అందుకోసం పార్టీ కేడర్‌ను అధిష్టానం సన్నద్ధం చేస్తోంది. స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా తాము సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్‌కు మలుపు అని ప్రకటించారు. అంతేకాదు లోకల్ బాడీ ఎన్నికలు ( (Brs) బీఆర్ఎస్‌కు ప్రీ ఫైనల్స్ లాంటివని.. ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు.

 Also Read: Bhadradri Kothagudem: కోట్లు దండుకుంటున్న కాంట్రాక్టర్.. ఆందోళనలో గిరిజనులు

మళ్ళీ కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి కావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ప్రకటించారు. మరోవైపు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు (Harish Rao)  సైతం అందరూ కలిసి పనిచేయాలని, మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలని పిలుపునిచ్చారు. 31 జడ్పీ స్థానాల్లో 16 నుంచి 18 స్థానాలు గెలుచుకొని సత్తా చాటుదామన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుందని పేర్కొంటూ కేడర్‌లో ధీమా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, పోటీచేసే అభ్యర్థులపై స్థానిక‌ బీఆర్ఎస్ నేతలు ఏకాభిప్రాయానికి వచ్చి, సమిష్టిగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు.

గుచ్చుకుంటున్న ముళ్లు!
బీఆర్ఎస్(Brs) అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలై దాదాపు 20 నెలలు కావస్తున్నది. ఇంతవరకూ పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించలేదు. పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించలేదు. కనీసం క్షేత్రస్థాయిలో పర్యటించి అభిప్రాయాలను సేకరించలేదు. గ్రామస్థాయి నుంచి పార్టీపై ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది? ఎందుకు ఓడిపోయాం? అనే దానిపై పీడ్ బ్యాక్ కూడా తీసుకోలేదు. కొంతమంది నేతలతో మాత్రమే భేటీ అయ్యి సమాచారం తెలుసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరోవైపు గ్రామస్థాయిలోనూ పార్టీలో గ్రూపులు ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేనే నియోజకవర్గానికి సుప్రీం అని చెప్పడంతో సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో మొదటి నుంచి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించకపోవడం, సమస్య చెప్పుకుందామని వెళ్లినవారికి సైతం సమయం ఇవ్వకపోవడంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో చూపారనే ప్రచారం కూడా జరిగింది. అయినా పార్టీ ప్రక్షాళన చేపట్టలేదు. అంతేకాదు ఎమ్మెల్యే వర్గానికే పదవులు ఇవ్వడంతో మెజార్టీగా గ్రామస్థాయిలోనే వ్యతిరేకత వచ్చింది. మరోవైపు గ్రూపులు సైతం ఉండటంతో ఎలా కలిసి ముందుకు నడుస్తారు, ఏకాభిప్రాయం కుదురుతుందా? లేదా? ఒక వర్గానికి టికెట్ వస్తే మరోవర్గం సర్దుకుంటుందా? నేతలు ఆ గ్రూపులకు తెరదించుతారా? అనేది కూడా పార్టీలో చర్చకు దారితీసింది. ఈ సమస్యలను గులాబీ ముళ్లులా గుచ్చుకోబోతున్నాయి.

నమ్మేదెలా?
పార్టీ ఓటమి తర్వాత కూడా గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు వేస్తారని, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్నవారికి అవకాశం కల్పిస్తారని నేతలు ఆశపడుతున్నారు. సీనియర్లకు నియోజకవర్గ, జిల్లా కమిటీల్లో చోటు దక్కుతుందని, జిల్లా స్థాయిలో పనిచేసేవారికి రాష్ట్ర కమిటీలో చోటు దక్కుతుందని భావించారు. కానీ, ఇప్పటివరకు పార్టీ అధిష్టానం పార్టీ పటిష్టతపై చర్యలు తీసుకోలేదు. కమిటీలు వేయలేదు. దీంతో యాక్టివ్‌గా పనిచేసిన నేతలు సైతం నిరాశకు గురయ్యారు.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా పనిచేస్తారనేది హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే పార్టీకోసం పనిచేసిన వారికి గుర్తింపు దక్కడం లేదని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. కేటీఆర్ సైతం స్వయంగా ప్రకటించారు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేశాం తప్ప, ఆనాడు ప్రజల కోసం పనిచేస్తూ పార్టీ నాయకులను పట్టించుకోకపోవడం వాస్తవమే అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక గతంలో చేసిన తప్పును పునరావృత్తం చేయబోమని, అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలు, నాయకులను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు. కానీ, నేతలు ఎలా విశ్వసించి ముందుకు సాగుతారనేది కూడా చర్చనీయాంశమైంది.

కవితతో దెబ్బే!
పార్టీలో కీలక నేతగా పనిచేసిన ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ పేరుతోనే కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీలోనే ఉన్నానని చెబుతూ గులాబీ పేరుతో సమావేశాలు నిర్వహించట్లేదు. అంతేకాదు ఆమె కార్యక్రమాలకు గులాబీ నేతలంతా దూరంగా ఉంటున్నారనేది ఆమె చేపడుతున్న కార్యక్రామాలతోనే స్పష్టమవుతున్నది. అయితే, స్థానిక సంస్థల్లో ఆమె ఎలా ముందుకెళ్తారు? అనేది ప్రశ్నార్థకమే. కవిత నిర్వహిస్తున్న కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి సపోర్టు చేసే విధంగా ఉన్నాయని, ఇప్పటికే గులాబీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

విమర్శలు ఎక్కుపెట్టకుండా కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది బీఆర్ఎస్‌కు డ్యామేజ్ చేస్తుందని సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీఆర్ఎస్‌పై ఎఫెక్ట్ పడుతుందనే అభిప్రాయపడుతున్నారు. పరిణామాలన్నీ బీఆర్ఎస్‌కు పరీక్షగా మారాయి. ఈ పరీక్షల్లో డిస్ట్రెక్షన్ పాస్ అవుతుందా? ఫిఫ్టి ఫిప్టీతో విజయం సాధిస్తుందా? పాస్ మార్కులతోనే గట్టెక్కుతుందా? అనేది చూడాలి.

Also Read: Diets – Supplements: ప్రొటీన్స్ తీసుకోవడంలో కన్ఫ్యూజనా? ఇవి తెలిస్తే ఫుల్ క్లారిటీ వచ్చినట్లే!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం