BJP Payal Shankar (imagecredit:swetcha)
Politics

BJP Payal Shankar: ఏం చేశారని దేశానికి తెలంగాణ ఆదర్శం: పాయల్ శంకర్

BJP Payal Shankar: బీసీ రిజర్వేషన్ల బిల్లుపై కాంగ్రెస్ నాటకాలాడుతోందని బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ విమర్శలు చేశారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాము అసెంబ్లీలో లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా కాంగ్రెస్(Congress) ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదని చురకలంటించారు. బీసీ(BC) బిల్లు పేరుతో ముస్లిం(Muslim)లకు రిజర్వేషన్లకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆయన మండిపడ్డారు. 42 శాతంలో 10 శాతం ముస్లింలకు ఇస్తే 32 శాతం మాత్రమే బీసీ(BC)లకు రిజర్వేషన్లు అమలవుతాయని చెప్పుకొచ్చారు.

బీసీల హక్కులను ముస్లింలకు

రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందని దేశం ఆదర్శంగా తీసుకోవాలని పాయల్ శంకర్(Payal Shankar) ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress) ఉమ్మడి ఏపీ(AP)లో ఎందుకు ఒక్క బీసీని కూడా సీఎం(CM)ను ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. బీసీల హక్కులను ముస్లింలకు దోచిపెడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 50 ఏండ్లకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస. ఎప్పుడూ 20 శాతం మించి బీసీలకు కేబినెట్‌లో చోటు కల్పించలేదని ధ్వజమెత్తారు.

ముస్లింలకు కాకుండా పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను బీసీలకు ఇస్తామని కాంగ్రెస్(Congres) ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ బిల్లుపై కాంగ్రెస్ ను నిలదీస్తామని పాయల్ శంకర్ స్పష్టంచేశారు. బీసీ బిల్లులో మస్లీంలను తీసివేసి కేవలం బీసీలను మాత్రమే ఉంచితే మేం సపోర్ట్ చేస్తామని అన్నారు.

Also Read: Telangana: ఆ విషయంలో తెలంగాణను ఢీకొట్టే రాష్ట్రమే లేదు.. దేశంలోనే నెంబర్ వన్!

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!