తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: BJP Etela Rajender: మూసీ ప్రక్షాళనకు, మురుగునీటి శుద్ధికి, శుభ్రమైన తాగునీటి కోసం కేంద్రం నిధులు కేటాయించాలని మల్కాజిగరి ఎంపీ ఈటల రాజేందర్ కేంద్రాన్ని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన జల్ శక్తి మంత్రిత్వ శాఖకు గ్రాంట్ల డిమాండ్లపై మాట్లాడారు. వేగవంతమైన పట్టణ విస్తరణ, పెరుగుతున్న జనాభా అవసరాలను తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తగినంత మౌలిక సదుపాయాలు, సేవలను అందించడంలో ఇబ్బంది పడుతున్నాయని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం ఈ సవాలును గుర్తించి స్మార్ట్ సిటీస్ మిషన్, అమృత్(అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్) కింద పారిశుధ్యం, సురక్షితమైన తాగునీటి సౌకర్యాల కోసం రూ.వేల కోట్లు కేటాయించడం సంతోషంగా ఉందన్నారు. అందులో భాగంగా మల్కాజిగిరి అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు ఇక్కడికి జీవనోపాధి కోసం వలస వస్తారని, వారికి మౌలిక సదుపాయాలు కల్పించడం ఇబ్బందిగా మారుతోందని, అందువల్ల పారిశుద్ధ్య ప్రాజెక్టులు, తాగునీటి సౌకర్యాలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు.
Also Read: SC on TG Govt: తెలంగాణ ప్రభుత్వానికి ‘సుప్రీం’ నోటీసులు.. ఆ ఎమ్మెల్యే ఏమన్నారంటే?
హైదరాబాద్‌లోని సరస్సులు మురుగునీటితో కలుషితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ నగరాన్ని సరస్సుల నగరంగా పిలిచేవారని గుర్తుచేశారు. హుస్సేన్ సాగర్‌తో సహా దాని నీటి వనరులు అన్ని మురుగునీటి ప్రవాహాల కారణంగా కలుషితమయ్యాయని, చేపలు, ఇతర జీవవైవిధ్యం నాశనమైందన్నారు. కలుషిత నీటి కారణంగా భూగర్భ జలాలు పొల్యూట్ అయ్యాయని, దీంతో ప్రజలు రోగాలబారిన పడుతున్నారని వివరించారు.
ఈ సరస్సులను పునరుద్ధరించడానికి, మురుగునీటిని మళ్లించడానికి, ప్రత్యామ్నాయ మురుగునీటి శుద్ధి మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శుద్ధి చేసిన నీరు మాత్రమే సరస్సులలోకి వచ్చేలా మురుగునీటి శుద్ధి కర్మాగారాలను నిర్మించేందుకు నిధులు కేటాయించాలని ఈటల రాజేందర్ కోరారు.
Also read: స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు