Somu Veerraju On Narayana: సీపీఐ నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలి.
Somu Veerraju On Narayana(image credit:X)
Political News

Somu Veerraju On Narayana: సీపీఐ నారాయణ పాకిస్థాన్ వెళ్లిపోవాలి.. ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..

Somu Veerraju On Narayana: శత్రు దేశం పాకిస్థాన్, భారత్‌పై హద్దులు మీరి విచ్చలవిడిగా కాల్పులకు తెగబడుతోంది. అయితే ఇలాంటి విపత్కర సమయంలో సీపీఐ జాతీయ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.

ఆయన చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్సీ, సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు ఇండియాలో జీవించే అర్హత లేదని, అక్కడి (పాకిస్థాన్) ప్రజల తోనే జీవించాలని అన్నారు. పాకిస్థాన్ ప్రజలపై అంత ప్రేమ ఉంటే అన్ని సర్దుకుని అక్కడికే వెళ్లిపోవాలని సంచలన కామెంట్స్ చేశారు.

యుద్ధం చేయాలని దేశ ప్రజలంతా ఆవేశంతో ఉంటే యుద్ధం వద్దంటావా? అని, దేశంలో ఇంత ఘోరం జరుగుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడటం కరెక్టేనా అని ఘాటు విమర్శలు చేశారు. సీపీఐ పార్టీ నుంచి నారాయణను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

సీపీఐ నారాయణ వ్యాఖ్యలు
భారత్, పాక్ మధ్య యుధ్ధం (operation sindoor) నెలకొన్న నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. మన యుద్ధం పాకిస్థాన్ ప్రజలమీద కాదు.. ఉగ్రవాదం పై అని కామెంట్స్ చేయడం జరిగింది. భారత్, పాకిస్థాన్ లో ఉన్న అమాయక, సామాన్య ప్రజలపైన కాల్పులు జరిపి ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు.

Also read: Chamala Kiran Kumar: మిస్ వరల్డ్ పోటీలపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్.. ఎంపీ చామల ఫైర్!

అలాగే పాక్ కు చైనా అండగా ఉందని అనడం సరైంది కాదని, అవన్నీ అపోహలే అని కొట్టి పారేశారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో అన్ని వర్గాల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నారాయణపై ధ్వజమెత్తారు. రాజకీయ రంగు పులుముకున్న ఈ వ్యాఖ్యలు ఇంతటితోటే ఆగుతుందా? లేదా అనేది వేచి చూడాలి.

 

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం