Chamala Kiran Kumar (imagecredit:twitter)
తెలంగాణ

Chamala Kiran Kumar: మిస్ వరల్డ్ పోటీలపై ఎమ్మెల్సీ కవిత కామెంట్స్.. ఎంపీ చామల ఫైర్!

Chamala Kiran Kumar: మిస్ వరల్డ్ కాంపిటీషన్ పై ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని, రాజకీయంలో ఉన్నాం కదా అని ఏదో ఒకటి మాట్లాడాలి అన్నా ఆలోచన తప్ప మిస్ వరల్డ్ కాంపిటీషన్‌లను పోస్ట్ ఫోన్ చేయడం లేదా రద్దు చేయడం లాంటి కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వానికి చేసే అధికారం లేదు అని ఆయన తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం కేవలం ఒక ఫెలిసేటేటర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఈరోజు చాలా సేఫెస్ట్ ప్లేస్ అని తెలంగాణలో పెట్టుబడులు పెట్టొచ్చని తెలంగాణాలో ఇంత పెద్ద ఈవెంట్లు ప్రపంచ వ్యాప్తంగా చూస్తున్నటువంటి ఈవెంట్లను చేయవచ్చని, ఒక 4 & 5 నెలల క్రితం ఈ ప్లేస్ తెలంగాణను సెలెక్ట్ చేసుకోవడం జరిగిందని అన్నారు. ఈరోజు మిస్ వరల్డ్ లిమిటెడ్ అనే కంపెనీ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఆ కంపెనీ ఏదైనా నిర్ణయం తీసుకొని పోస్ట్ ఫోన్ చేయాలనుకుంటే తప్పకుంచడా తెలంగాణ ప్రభుత్వం వారికి సహకరిస్తుందని అన్నారు, వాళ్లు నిర్వహించాలి అనుకున్నప్పుడు మనం వాటిని పోస్ట్ పోన్ చేయలేంమని అన్నారు.

Also Read: Sneha Shabarish: జీహెచ్ఎంసీలో అంతర్గత బదిలీలు.. ఇద్దరు అధికారులకు విభాగాల మార్పు..

105 దేశాల నుండి మిస్ వరల్డ్ మరియు మిస్ కంట్రీస్ వచ్చి ఇక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొంటున్నారు, అలాగే వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కలిపి ఒక మూడు నుండి నాలుగు వందల మంది డెలిగేట్స్ తెలంగాణలో ఉన్నారు. వీళ్ళందరినీ నడిపించేటువంటి ఇవెంట్, ఈ ఇవెంట్ నడిపించేటువంటి స్పాన్సర్షిప్ చాలామంది ఇక్కడే ఉన్నారు వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం అది, తెలంగాణ మీద నమ్మకంతో ఇక్కడ ఈవెంట్ పెట్టుకున్నారని ఆయన తెలిపారు. కవిత ఒక తెలంగాణ నాయకురాలుగా ఉండి ఆమె ఒక రాజకీయ నాయకురాలిగానే కాకుండా ఇంతో అంతో ఇంకితజ్ఞానం ఉండి అమెరికాలో కూడా చదువుకొని వచ్చింది కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పరిధి ఏంటి అనేది ఆమెకి అర్థం అయి ఉండాలి, కానీ రాజకీయం చేయాలన్న దురుద్దేశం నుంచి దూరంగా ఉండి వాస్తవాలు మాట్లాడాలి అని కోరుకుంటున్నానని ఎంపి చామలకిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!