MP Kishan Reddy( IMAGE credit: swetcha reporter)
Politics

MP Kishan Reddy: నగరంలో అక్రమ భూముల వ్యాపారం.. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు!

MP Kishan Reddy: హైదరాబాద్‌లో అభివృద్ధి కాకుండా అద్భుతంగా ఏదైనా జరుగుతున్నదంటే అది అక్రమ భూముల వ్యాపారం మాత్రమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy) విమర్శలు చేశారు. గత సర్కార్ హయాంలో ఇది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఉండేదని, ఈ సర్కార్ హయాంలో హోల్‌సేల్‌గా ఎవరి కౌంటర్ వారు ఓపెన్ చేశారంటూ ఆరోపించారు. కిషన్ రెడ్డి నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఖాసీం రజ్వీ దురాఘాతాలను, మహిళలపై జరిగిన అరాచకాలపై వ్యతిరేకంగా కలం ద్వారా పోరాటం చేసిన వ్యక్తి షాయబుల్లా ఖాన్ అని కొనియాడారు. ఆయన వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి నివాళులర్పించారు. ఆయన కలం పోరాటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగా హైదరాబాద్ కు విముక్తి లభించిందన్నారు.

 Also Read: Begari Vishnu:పేదరికాన్ని జయించి.. పీహెచ్‌డీ పట్టా

డివిజన్‌కు 50 లైట్లు

సెప్టెంబర్ 17న తెలంగాణ లిబరేషన్ డేను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత బీఆర్ఎస్, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ హైదరాబాద్ అభివృద్ధిపై మాటలు కోటలు దాటుతున్నాయి తప్పా.. అభివృద్ధి నామమాత్రంగా ఉందన్నారు. దేశంలోనే వీధి లైట్లు వెలగని నగరం హైదరాబాద్ మాత్రమేనని కేంద్ర మంత్రి వెల్లడించారు. తాము ధర్నా చేస్తే ప్రతి మున్సిపల్ డివిజన్‌కు 50 లైట్లు ఇస్తామన్నారని, కానీ అవి కూడా ఇవ్వలేదని ఆయన విమర్శలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పుణ్యమా అని అనేక సమస్యలతో నగరం కొట్టుమిట్టాడుతోందని ఫైరయ్యారు.

బిల్లులు కూడా చెల్లించడం లేదు

ఒరిజినల్ హైదరాబాద్ ను నిర్లక్ష్యం చేసి భూముల వేలం ద్వారా ప్రభుత్వానికి వస్తున్న చోట్ల, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో మాత్రమే దృష్టి సారిస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుదామంటే తమ కార్పొరేటర్లకు మైక్ ఇవ్వడంలేదని, తూతుమంత్రంగా సమావేశాలు నిర్వహించి బడ్జెట్ పాస్ చేసుకుంటున్నారని విమర్శలు చేశారు. గోతులు పూడ్చే చిన్న కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించడం లేదని, దీంతో వారు ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు.

జీహెచ్ఎంసీ పలు పనులకు టెండర్లు పిలిస్తే ఎవరూ రాని పరిస్థితి ఉందన్నారు. బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియక ముందుకు రావడం లేదని తెలిపారు. ఏదైనా అంశంపై మాట్లాడితే మంత్రులు కౌంటర్లు ఇస్తున్నారని, కానీ అభివృద్ధి మాత్రం చేపట్టడంలేదని ధ్వజమెత్తారు. సచివాలయం ముట్టడికి పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు చేస్తున్నారని, సర్కార్‌కు అంత భయం దేనికని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. తాము అరెస్టులకు భయపడబోమని, జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమన్నారు.

 Also Read: Vishal 35 Movie: ‘విశాల్ 35’ ప్రాజెక్ట్‌లో అంజలికి ఛాన్స్.. ఆ బ్యానర్‌కి ఇది 99వ చిత్రం

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!