– బీజేపీ, బీఆర్ఎస్ చెట్టాపట్టాల్
– ఈటలే గెలుస్తారంటున్న మల్లారెడ్డి
– ఎమ్మెల్యే తీరుపై రాగిడి అసంతృప్తి
– డ్రామాలు ఆపాలంటూ కాంగ్రెస్ శ్రేణుల చురకలు
bjp candidate etela rajender will win says brs mla mallareddy : మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏం చేసినా వైరల్ అవుతుంటుంది. పార్టీలతో పనేముంది అన్నట్టుగా ఆయన తీరు ఉంటుంది. గతంలో బీఆర్ఎస్‌లో కీలకంగా పనిచేసి తర్వాత బయటకు పంపించబడిన కేసీఆర్ శత్రువు, బీజేపీ నేత ఈటల రాజేందర్‌ను తాజాగా మల్లారెడ్డి ఆప్యాయంగా పలకరించారు. ఆలింగనం చేసుకున్నారు. అరె, ఫొటో తీయండి అంటూ ఈటలతో కలిసి ఫోజిచ్చారు. అంతేనా, మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తున్న ఈటల రాజేందరే గెలుస్తారని జోస్యం చెప్పారు.
అన్నా నువ్వే గెలుస్తున్నావ్!
ఈటలతో మాజీ మంత్రి మల్లారెడ్డిమల్లారెడ్డి మాటలను వ్యతిరేకిస్తున్న రాగిడి లక్ష్మా రెడ్డి వర్గం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్న ప్రచారానికి నిదర్శనమే ఈ కలయిక అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు.#BJP #BRSparty #mallareddy #eatalarajendar #viralvideo… pic.twitter.com/5fnl9xAvoI
— BIG TV Breaking News (@bigtvtelugu) April 26, 2024
ఈ స్థానంలో మల్లారెడ్డి సొంత పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్నారు. ఎవరైనా సొంత పార్టీ అభ్యర్థి గెలవాలని కోరుకోవాలి. కానీ, మల్లారెడ్డి మాత్రం ప్రత్యర్థి పార్టీ గెలుపు కోసం తాపత్రయపడడం చూసి అందరూ నవ్వుతున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన వివాహ వేడుకలో వీరిద్దరూ కలిశారు. ఈటల చాలా సాధారణంగానే కనిపించినా మల్లారెడ్డి మాత్రం ఎగ్జయిటింగ్‌గా ఆయనను దగ్గరకు తీసుకున్నారు. అలయ్ బలయ్ చేశారు. ఆ తర్వాత ఫొటో తీయండ్రా అంటూ ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
Also Read: సంగారెడ్డి ఎమ్మెల్యే వచ్చినా ఓకే.. : జగ్గారెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, బీజేపీ మల్కాజ్‌గిరి అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుస్తారని చెప్పడంతో రాగిడి లక్ష్మారెడ్డి వర్గం గుర్రుగా ఉన్నది. మరోవైపు, బీజేపీ, బీఆర్ఎస్ దోస్తులేనని, అందుకు ఇదే సాక్ష్యం అని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర పలు నియోజకవర్గాల్లో చేపట్టడం లేదు. ఆయా స్థానాల్లో బీజేపీకి లబ్ది చేకూర్చేందుకే ఆయన అలా చేస్తున్నారన్న ప్రచారం ఉంది. ఇలాంటి సమయంలో మల్కాజ్‌గిరిలో ఈటలదే గెలుపు అంటూ మల్లారెడ్డి మాట్లాడడం వీళ్ల చీకటి బంధానికి నిదర్శనంగా చెబుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు.