BJP BRS Combine Trying To Undermine Me In Kodangal CM Revanth
Politics

CM Revanth Reddy: రికార్డు మారుమోగాలి, కొడంగల్‌ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

– కొడంగల్‌లో సీఎం రేవంత్
– పాలమూరు ఎంపీ ఎన్నికపై నేతలతో సమీక్ష
– భారీ మెజారిటీ సాధిద్దామని పిలుపు
– కార్యకర్తలందరికీ గుర్తింపు తథ్యం
– బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాల సమర్పణ

BJP BRS Combine Trying To Undermine Me In Kodangal CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం కొడంగల్‌లోని తన స్వగృహంలో జరిగిన పార్టీ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కొడంగల్ వచ్చిన సీఎంకు స్థానిక నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మండల స్థాయిలో ప్రచారం, ఎన్నికల వ్యూహాలపై మండల స్ధాయి కాంగ్రెస్ నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సమీక్షకు హాజరైన నేతల భేటీ అనంతరం పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో ఆయన ముచ్చటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానాన్ని బంపర్ మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త, నాయకుడి మీద ఉందని సమీక్ష సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. పార్టీకోసం పనిచేసే ప్రతి కార్యకర్తనూ పార్టీ గుర్తిస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం కొడంగల్‌లోని మహాలక్ష్మి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్ని స్వామి వారికి సీఎం పట్టు వస్ర్తాలు సమర్పించారు.

తప్పిన ముప్పు

కొడంగల్ పర్యటన నిమిత్తం హైదరాబాద్ నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని ఒక కారు టైరు ఉన్నట్టుండి పేలింది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పటం, ఆ సమయంలో సీఎం వేరే వాహనంలో ఉండటంతో భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత మిగిలిన వాహనాలతో సీఎం కాన్వాయ్ కొడంగల్ చేరింది.

Also Read: తెలంగాణలో కమలం బలం పెరుగుతోందా..?

ఉగాది శుభాకాంక్షలు

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే శ్రీ క్రోధి నామ సంవత్సరం తెలంగాణ ప్రజలకు శుభాలను, విజయాలను అందించాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరంలో సమృద్ధిగా వానలు కురిసి, రైతుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని, అన్ని రంగాల్లో మెరుగైన ప్రగతిని సాధించనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు చాటిచెప్పేలా ఘనంగా ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాలని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ