BC Bandh (imagecredit:twitter)
Politics, తెలంగాణ

BC Bandh: బీసీ బంద్‌కు దూరంగా కీలక నేతలు.. ఇది దేనికి సంకేతం

BC Bandh: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ జేఏసీ(BC JAC) ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌ను శనివారం చేపట్టింది. ఈ బంద్‌కు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్‌లో పాల్గొన్నాయి. కానీ, బీఆర్ఎస్(BRS) పార్టీ కీలక నేతలు కేటీఆర్(KTR), హరీశ్ రావు(Harish Rao) దూరంగా ఉన్నారు. మద్దతు ప్రకటించి పాల్గొనకపోవడం ఏంటని బీసీలు నిలదీస్తున్నారు. బీసీలపై వారి వైఖరి ఏంటో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. బంద్‌లో ఎందుకు పాల్గొనలేదు, బీసీ రిజర్వేషన్లపై ఎందుకు డిమాండ్ చేయలేదని పలువురు పశ్నిస్తున్నారు.

మ్మెల్యేలు సైతం బంద్‌లో పాల్గోనలేదు

మరోవైపు, జాతీయ పార్టీ బీజేపీ(BJP) నుంచి సైతం ఆగ్ర నేతలు ఎవరూ పాల్గొనలేదు. పార్టీ అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandra Rao) దూరంగా ఉన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishan Reddy), ఎంపీ లక్ష్మణ్(MP laxman), ఇంకా పలువురు ఎమ్మెల్యేలు సైతం బంద్‌లో పాల్గొనకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరునే రాష్ట్ర నేతలు అవలంబిస్తున్నారని, మద్దతు ప్రకటించి పాల్గొనకపోవడం వారి రెండుకళ్ల సిద్దాంతం స్పష్టమవుతున్నదని, బీసీలను బీజేపీ మోసం చేస్తున్నదని పలువురు మండిపడుతున్నారు.

Also Read: Kapil Sharma café: మరోసారి కపిల్ శర్మ కెనడా కేఫేలో కాల్పుల కలకలం.. ఎందుకంటే?

నిరంతరం బీసీ భజన చేసే..

కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు చేపట్టిన బంద్‌లో బీసీ(BC)ల పక్షాన పాల్గొనకపోవడంపై బీసీలంతా ఆగ్రహంతో ఉన్నారు. ఇంకోవైపు, బీసీల పక్షమని చెబుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్(Mallnna)న సైతం బీసీ బంద్‌లో పాల్గొనలేదు. అందుకు సంబంధించిన ఫొటోలు సైతం రిలీజ్ చేయలేదు. నిత్యం బీసీ జపం చేసే మల్లన్న తీరుపై బీసీలు సైతం ఆగ్రహంతో ఉన్నారు. ఆయన ఏం సందేశం ఇస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Also Read: Warangal District: నిబంధనలు ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవు: కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Just In

01

NIMS Hospital: నిమ్స్ ఆసుపత్రిలో అక్రమ నియామకాలు.. శాంతి కుమారి కమిటీ రిపోర్ట్‌లో సంచలనాలు..?

Twitter toxicity: సినిమాలపై ట్విటర్‌లో ఎందుకు నెగిటివిటీ పెరుగుతుంది?.. ట్విటర్ టాక్సిక్ అయిపోయిందా?

Ashanna: మావోయిస్టు పార్టీ ఆరోపణలను ఖండించిన ఆశన్న

Viral Video: అయ్యప్ప మాల దీక్షను తీసుకుని మద్యం సేవించిన స్వామి.. వీడియో వైరల్

Ramchandra Rao: జూబ్లీహిల్స్‌లో రెండు రాష్ట్రాల నేతలు కలిసి పని చేస్తాం..?