Pune Incident : పూణేలో మరో నిర్భయ ఘటన చోటుచేసుకుంది. ఆగి ఉన్న బస్సులో మహిలపై అత్యాచారం (Rape) చేయడం సంచలనం రేపుతోంది. అది కూడా పోలీస్ స్టేష్ కు 100 మీటర్ల దూరంలోనే జరగడంతో తీవ్ర కలకలం రేపుతోంది. పూణేలోని సతారా జిల్లా ఫల్తాన్ అనే గ్రామానికి చెందిన ఓ మహిళ పనిమనిషిగా పనిచేస్తోంది. రోజు లాగానే స్వర్గేట్ బస్టాండ్ కు తెల్లవారు జామున 5 గంటలకు చేరుకుంది. అక్కడే ఉన్న నిందితుడు రాందాస్ (35) ఆమెపై కన్నేశాడు. దాంతో ఆమె వద్దకు వెళ్లి మాట్లాడుతుండటం సీసీ టీవీలో కనిపిస్తోంది.
ఆమె ఎక్కడకు వెళ్తుందో తెలుసుకున్న రాందాస్.. ఆగిఉన్న బస్సు అటే వెళ్తుందని తనను నమ్మించినట్టు బాధితురాలు తెలిపింది. తాను బస్సు ఎక్కగానే మొత్తం చీకటి ఉండటంతో అనుమానం వచ్చిందని.. ప్రయాణికులు పడుకోవడంతో లైట్లు ఆపేసినట్టు నిందితుడు చెప్పాడని ఆమె వివరించింది. తాను బస్సు ఎక్కగానే డోర్లు మూసేసి తనపై అత్యాచారం చేసినట్టు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. తనపై అత్యాచారం జరిగిన తర్వాత స్నేహితురాలి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించింది. నిందితుడు రాం దాస్ కు గతంలో నేరచరిత్ర ఉన్నట్టు తెలుస్తోంది. అతనిపై గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయని సమాచారం.