Sowmya Swaminathan: ‘రోజుకు ఉద్యోగులు ఎన్ని గంటలు(Working Hours) పనిచేయాలి?’ ఈ విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కొందరు కార్పొరేట్(Corporate) దిగ్గజాలు 70 గంటలు(70 Working Hours) చేయాలంటారు. ఇంకొందరు 90 గంటలం(90 hours)టారు. అదే స్థాయి వాళ్లు ఆ వ్యాఖ్యలను ‘బుల్ షిట్’ అంటూ కొట్టేస్తారు. దీపికా పదుకొణే(Deepika Padukone) వంటి సెలబ్రిటీలు కూడా ఖండిస్తారు. ఇంకొకరు ‘ఎక్కువ సేపు ఇంట్లో ఉంటే పెళ్లాం పారిపోతుంది’’ అంటారు. ఇలా కొంతమంది ప్రముఖులు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. మొత్తంగా ఇది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారం. అయితే తాజాగా ఈ విషయంపై డబ్ల్యూహెచ్‌ఓ (WHO) మాజీ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్(Sowmya Swaminathan) మాట్లాడారు. ఆమె ఎం చెప్పిందో చూద్దాం.
ఎక్కువసేపు పనిచేయడం వల్ల సామర్థ్యం తగ్గిపోతుందని, అలాంటప్పుడు శరీరం చెప్పినట్లు వినాలని ఆమె సూచించారు. తాజాగా పీటీఐకి ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు.చాలా మంది సమయం తెలియకుండా కష్టపడి పనిచేస్తారని, అది వాళ్ల వ్యక్తిగత సామర్థ్యమని అభిప్రాయపడ్డారు. దాన్ని అందరికి ఆపాదించాలనుకోవడం సరైంది కాదన్నారు. బాగా శ్రమించి అలసిపోయినప్పుడు శరీరం మనకు సిగ్నల్ ఇస్తుందని, అప్పుడు మనం దాని మాట వినాలని హితవు పలికారు. అదే సమయంలో, అనివార్య పరిస్థితుల్లో ఎక్కువ సేపు పనిచేయక తప్పని సందర్బాల్లో చేయొచ్చని కానీ అది కూడా కొంతకాలమే సాధ్యమవుతుందని తెలిపారు. కోవిడ్-19 సమయంలో అలానే చేసినట్లు గుర్తుచేశారు. అయితే దీర్ఘకాలంపాటు దానిని కొనసాగించడం మంచిది కాదన్నారు.
‘‘మహమ్మారి సమయంలో మేమంతా రెండు-మూడు సంవత్సరాలు చాలా కష్టపడి పనిచేశాం. సరిగ్గా నిద్రపోలేదు. చాలా కాలం పాటు ఒత్తిడికి గురయ్యాం. కొందరైతే నిరంతరం శ్రమించారు. వారి పట్ల చాలా ఆందోళన చెందాం. అందులో కొంతమంది ఏకంగా వృత్తులనే విడిచిపెట్టారు ’’ అంటూ వివరించారు స్వామినాథన్. మానసిక విశ్రాంతి అనేది పని చేయడానికి చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. నిద్ర(Sleep) ద్వారా కూడా అది చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆఫీసు టేబుల్ మీద 12 గంటలు నిర్విరామంగా కూర్చోవచ్చు గానీ ఎనిమిది గంటల తర్వాత ఎంత నాణ్యత(Productive)తో పని చేస్తున్నామో పరిశీలించుకోవాలని ఆమె సూచించారు. ఎన్ని గంటలు పనిచేశాం అనే దానికంటే ఎంత నాణ్యతతో చేస్తున్నామన్నది కీలకమన్నారు.
కాగా, ప్రపంచ దేశాలతో పోటీ పడాలంటే భారత యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలని ఇన్ఫోసిస్ (Infosys) నారాయణ మూర్తి(Narayanamurthy) చేసిన వ్యాఖ్యలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. దాన్నే అందరూ వ్యతిరేకించారనుకుంటే… ఇంకో రెండు మెట్లు ఎక్కి.. ఎల్ అండ్ టి ఛైర్మన్(L&T Chairman) ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్(SN Subramanyan) వారానికి 90 గంటల పాటు పనిచేయాలి అని ట్రోల్ అయ్యారు. ఇక, ప్రముఖ వ్యాపార వేత్త హర్ష్ గోయెంకా(Harsh Goyenka) సైతం సౌమ్య మేడం చెప్పినట్లే చెప్పారు. ఎక్కువ సేపు పనిచేయడం కాదు వర్క్ లో క్వాలిటి ముఖ్యం అని. ఇక దీపికా పదుకొనే కూడా సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వీటన్నిటిని తలదన్నెలా… ప్రపంచ కుబేరుడు గౌతమ్ అదానీ(Gowtham Adani) మరో మాట అన్నారు. ఎక్కువ సేపు ఇంట్లో ఉంటే పెళ్లాం పారిపోతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైనా సౌమ్య స్వామినాధన్ చెప్పినట్లు కొందరికి స్వతహగా ఎక్కువ కెపాసిటి ఉంటుంది. కానీ అందరిని అది సాధ్యం కాదు. ఉదాహరణకి… కొంత మందికి నిద్ర చాలా తక్కువ పోతుంటారు. కానీ ఉత్సాహంగానే పనిచేస్తుంటారు. కొంతమంది సరిపడా నిద్ర లేకపోతే… మావల్ల కాదు అంటూ చేతులెత్తేస్తారు. లలితా జ్యూయెల్లరి ఎండీ… కిరణ్ గారిని తీసుకుంటే… ఆయన ఒక దశలో నిద్రే పోలేదట. రోెజు నెల్లూరు నుంచి చెన్నైకి చాలాసార్లు కార్లలో తిరిగేవారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరదీ అందరికి సాధ్యమా?