Jammu Kashmir | జమ్మూలో మరో ఘోరం జరిగింది. జమ్మూలోని ఎల్ వోసీ సెక్టార్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్ర గాయాల పాలయ్యారు. అఖ్నూరులో ఐఈడీ పేలుడు సంభవించినట్టు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
