TVK Rally Stampede: తమిళ సీనియర్ నటుడు, తమిళిగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అధినేత విజయ్ శనివారం నిర్వహించిన పార్టీ ర్యాలీలో (TVK Rally Stampede) పెనువిషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని కరూర్‌లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 33 మంది వరకు చనిపోయినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. మృతుల్లో చిన్నపిల్లలతో పాటు మహిళలు కూడా ఉన్నట్టు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్ అధికారుల ద్వారా తెలుస్తోంది. మృతి చెందిన వారిలో పిల్లలు మినహా మిగతావారంతా విజయ్ ప్రారంభించిన టీవీకే పార్టీ కార్యకర్తలేనని సమాచారం. కాగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టుగా సమాచారం. విజయ్ ర్యాలీ కోసం జనాలు దాదాపు 6 గంటలపాటు వేచిచూశారని, విజయ్ ఆలస్యంగా వేదిక వద్దకు చేరుకున్నారని స్థానికులు చెబుతున్నారు.
Read Also- Cow Rescue: భారత పర్యటనలో ఉన్న ఈ ఆస్ట్రేలియా టూరిస్ట్‌ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనేమో!
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న తమిళనాడు ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణియన్ హుటాహుటిన కరూర్‌కు వెళ్లారు. ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ కూడా వెంటనే స్పందించారు. పరిస్థితిని పర్యవేక్షించాలంటూ కరూర్ జిల్లా కార్యదర్శి సెన్తిల్ బాలాజిని ఆదేశించారు. ‘‘కరూర్ నుంచి వెలువడుతున్న వార్తలు చాలా కలవరంగా అనిపిస్తున్నాయి. తొక్కిసలాటలో గాయపడినవారికి తక్షణం వైద్యం అందించాలని ఆదేశించాను’’ అంటూ సీఎం స్టాలిన్ ట్వీట్ చేశారు.
Read Also- JubileeHills bypoll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై నోడల్ ఆఫీసర్లకు కీలక ఆదేశాలు
కాగా, ర్యాలీకి హాజరైన జనాల రద్దీ, తొక్కిసలాటను గుర్తించి విజయ మధ్యలోనే తన ప్రసంగాన్ని నిలిపివేశాడు. ఈ విషాదకర ఘటన జరగడానికి ముందే ఆ ప్రాంతంలో జనాలు పెద్ద సంఖ్యలో కనిపించారు. విజయ్ వేదిక వద్దకు చేరుకొని ప్రసంగం మొదలుపెట్టిన తర్వాత జనాల రద్దీ మరింత పెరిగిపోయింది. జనాలు నియంత్రణ తప్పిపోయి ముందుకు, వెనక్కు నెట్టుకున్నారు. దీంతో, తొక్కిసలాట జరిగింది. పరిస్థితి తీవ్రంగా మారుతోందని గమనించిన విజయ్ కార్యకర్తలను అప్రమత్తం కూడా చేశాడు. తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేశాడు. అయినప్పటికీ విషాదాన్ని ఆపలేకపోయాడు. తొక్కిసలాటను గుర్తించి తన ప్రత్యేక ప్రచార బస్సు మీద నుంచే వాటర్ బాటిళ్లు విసిరి జనాలకు నీరు అందించాడు.
జనాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ప్రమాద స్థలానికి అంబులెన్సులు చేరుకోవడం కూడా ఇబ్బంది ఎదురైంది. కాగా, కరూర్‌లో జరిగిన ఈ ర్యాలీకి కనీసం 30,000 మంది హాజరయ్యి ఉంటారని అంచనాగా ఉంది. విజయ్ బాధ్యతారాహిత్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని, విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ అధికార డీఎంకే పార్టీ నేతల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ దుర్ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు. రాజకీయ ర్యాలీలో తొక్కిసలాట జరగడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.