Stock Market
జాతీయం

Stock Market: కుప్పకూలిన మార్కెట్లు

– ఒక్కరోజే రూ.6 లక్షల కోట్లు ఆవిరి
– మూడోదశ తర్వాత ఊహించని పరిణామం

PM Modi: సార్వత్రిక ఎన్నికల వేళ ఊహించని పరిణామం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గురువారం స్వల్పలాభంతో మొదలైన స్టాక్ మార్కెట్ కాసేపటికే పతనం దిశగా సాగి, ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ. 6 లక్షల కోట్ల మేర నష్టపోయింది. సెన్సెక్స్ ఏకంగా 1062 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ 22 స్థాయిని కోల్పోయింది. సార్వత్రిక ఎన్నికల మూడవ దశ పోలింగ్ తర్వాత రాబోయే ఎన్నికల ఫలితాలపై మదుపరుల్లో కలిగిన అనుమానాలే నేటి పరిణామానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు భావిస్తు్న్నారు. నేటి పరిణామంతో టాటా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ షేర్లు లాభపడగా, ఎల్ అండ్ టీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్ డబ్యూ, జజాజ్ ఫైనాన్స్, ఐటీసీ షేర్లు భారీగా నష్టపోయాయి.

Also Read: హస్తం.. పేదల నేస్తం!

సార్వత్రిక ఎన్నికల ట్రెండ్స్, మెప్పించని క్యూ4 ఫలితాలు ప్రధాన షేర్లలో అమ్మకాల ఒత్తిడి, విదేశీ సంస్థాగత మదుపరుల అమ్మకాలు.. మొత్తంగా సెన్సెక్స్‌ పతనానికి కారణాలుగా నిలిచాయి. దీంతో మదుపరుల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ.6 లక్షల కోట్లు తగ్గి, రూ.393 లక్షల కోట్లకు పరిమితమైంది. గురువారం 73,499.49 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఏ దశలోనూ లాభాల్లోకి రాలేకపోయింది. మధ్యాహ్నానికి 72,334.18 కనిష్ఠానికి చేరిన సూచీ.. చివరికి 1062.22 పాయింట్ల నష్టంతో 72,404.17 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 345 పాయింట్లు కోల్పోయి 21,957 పాయింట్ల వద్ద స్థిరపడింది.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?