Special Pooja To Ayodhya Ram Arrow
జాతీయం

Rama banam: బాలరాముడి బాణానికి ప్రత్యేక పూజలు

Special Pooja To Ayodhya Ram Arrow: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో అయోధ్య రామమందిరం ప్రతిష్టాత్మకంగా కొలువై ఉంది. ఈ దేవాలయంలో కొలువై ఉన్న బాలరాముడి కోసం బంగారం, వెండి మిశ్రమాలతో ప్రత్యేకంగా తయారు చేసిన బాణం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి చేరుకుంది.

దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలకు ఈ బాణాన్ని తీసుకెళుతూ.. ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు వేద పండితులు. ఇందులో భాగంగానే అంజన్న సన్నిధికి ఈ బాణం చేరింది. నిజామాబాద్‌కు చెందిన శ్రీనివాస శర్మ అనే భక్తుడు బాలరాముడి కోసం ఈ బాణాన్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు. ఇందులో 13 కిలోల వెండి, కిలో బంగారంతో ఈ ధనుస్సుని తయారుచేశారు.

Also Read: టీమ్ ఇండియాపై సీఎం ప్రశంసల జల్లు

ఈ బాణాన్ని దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శింపజేసి చివరగా అయోధ్యకు తీసుకువెళ్లి బాలరాముడికి సమర్పిస్తామని శ్రీనివాస్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం ఈ బాణానికి కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించాడు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో చంద్రశేఖర్, ప్రధాన అర్చకుడు జితేంద్ర ప్రసాద్, స్థానచార్యుడు కపిందర్, ఉప ప్రధాన అర్చకుడు చిరంజీవి, భక్తులు పాల్గొన్నారు.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?