Sonia Gandhi: సోనియా అరుదైన స్పీచ్.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు
Sonia-Gandhi (Image source Facebook)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Sonia Gandhi: సోనియా గాంధీ అరుదైన స్పీచ్.. బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు

Sonia Gandhi: రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ (Congress Party) అగ్రనేత సోనియా గాంధీ (Sonia Gandhi) కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై (BJP) పరోక్షంగా ఘాటు విమర్శలు చేశారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూపై (Jawaharlal Nehru) నిందలు వేయడమే అధికార పార్టీ లక్ష్యమని ఆమె వ్యాఖ్యానించారు. ఆయనను అవమానించడానికి, అపఖ్యాతిపాలు చేయడం కోసం అనునిత్యం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వర్గానికి నెహ్రూను నిందించడమే ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో ఎటువంటి అనుమానం లేదన్నారు. వారి లక్ష్యం కేవలం నెహ్రూ ఖ్యాతిని తుడిచిపెట్టడమే కాకుండా, దేశంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక పునాదులను ధ్వంసం చేయడం కూడా వారి లక్ష్యంలో భాగమని సోనియా గాంధీ ఆరోపించారు.

దేశానికి నెహ్రూ చేసిన సేవలను విశ్లేషించడం, సద్విమర్శ చేయడం ఆహ్వానించదగినప్పటికీ, ఉద్దేశపూర్వకంగా ఆయనపై తప్పుడు ప్రచారం చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సోనియా గాంధీ పేర్కొన్నారు. నెహ్రూ లాంటి గొప్ప వ్యక్తి జీవితాన్ని విశ్లేషించడం, విమర్శలు చేయడం సహజమే, కానీ, చరిత్రను మార్చివేసేందుకు అసభ్యకరమైన, స్వార్థపూరిత ప్రయత్నాలు చేయడం, వ్యవస్థీకృత ప్రయత్నాలు చేస్తుండడం ఆమోదయోగ్యం కాదని సోనియా గాంధీ విమర్శించారు. నెహ్రుపై కుట్రలకు పాల్పడుతున్న ఈ వ్యక్తులకు స్వాతంత్ర్య ఉద్యమంలో, రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఎలాంటి పాత్ర లేదని సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా కాలం క్రితం మహాత్మా గాంధీ హత్యకు దారితీసిన ద్వేషపూరిత వాతావరణం నుంచి వారి సిద్ధాంతం పుట్టిందని, మహాత్మా గాంధీని చంపిన హంతకులను ఇప్పటికీ వారి అనుచరులు ప్రశంసిస్తున్నారని సోనియా గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి సిద్ధాంతం మత విద్వేషం, మతపరమైన దృక్పథాలతో కూడి ఉంటుందన్నారు.

Read Also- Gummadi Narsaiah Biopic: ప్రారంభమైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్.. మంత్రి ఏం అన్నారంటే?

అరుదైన స్పీచ్

గురువారం ఢిల్లీలో జవహర్ భవన్‌లో ‘నెహ్రూ సెంటర్ ఇండియా’ ప్రారంభ కార్యక్రమంలో ఈ మేరకు ఆమె మాట్లడారు. సాధారణంగా సోనియా గాంధీ రాజకీయపరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటారు. ప్రభుత్వ లోపాలు, ప్రజా సమస్యలపై లేఖల ద్వారా స్పందిస్తుంటారు. అలాంటిది ఒక బహిరంగ సభలో సోనియా గాంధీ ఈ విధంగా స్పందించడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థల పేర్లను ప్రత్యక్షంగా పలకకపోయినప్పటికీ, ఈ రెండు సంస్థలను లక్ష్యంగా చేసుకొని సోనియా గాంధీ మాట్లాడడం స్పష్టంగా అర్థమైంది.

రాజ్‌నాథ్ వ్యాఖ్యలకు కౌంటరా?

రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) ఇటీవల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీదు నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించాలని జవహర్‌లాల్ నెహ్రూ భావించారని, అయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని రాజ్‌నాథ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఖండించగా, తాజాగా, సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను గమనిస్తే రాజ్‌నాథ్‌ సింగ్‌కు కౌంటర్ ఇచ్చినట్టుగా అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాగా, 2014లో బీజేపీ కేంద్రంలో కొలువైన నాటి నుంచి, రాజకీయ ర్యాలీలు, పార్లమెంటు చర్చలు, ఎన్నికల ప్రచారాలు చాలా కార్యక్రమాల్లో బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీతో పాటు జవహర్‌లాల్ నెహ్రూపై పదేపదే విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

Read Also- Mahabubabad News: మహబూబాబాద్ రైల్వే మెగా డిపో తరలింపులో భారీ కుట్ర ఉంది: మహ్మద్ ఫరీద్

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు