SC on Father Custody (imagecredit:twitter)
జాతీయం

SC on Father Custody: కుమార్తెకు హోటల్ ఫుడ్.. తండ్రికి షాకిచ్చిన సుప్రీంకోర్టు!

SC on Father Custody: కేరళ హైకోర్టు ఉత్తర్వలు రద్దు చేస్తూ ఎనిమిదేళ్ల కుమార్తె సంరక్షణ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పాపకు ఇంటి భోజనం అందించలేకపోతున్నాడన్న కారణంతో తండ్రికి కేరళ హైకోర్టు మంజూరు చేసిన సంరక్షణ బాధ్యతలను రద్దు చేసి పూర్తి కస్టడీని తల్లికి అప్పగించింది. కోర్టు ఈ నిర్ణయం తీసుకునే ముందు జస్టిస్‌లు విక్రమ్‌నాథ్ మరియు సంజయ్ కరోల్, సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బాలికతో స్వయంగా మాట్లాడింది.

ఇద్దరు దంపతులు విడిపోయిన ఈ కేసులో గతంలో కేరళ హైకోర్టు 8 ఏళ్ల బాలిక కస్టడీని నెలకు 15 రోజుల చొప్పున తండ్రికి అప్పగించింది. అయితే సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ఆ తండ్రి కుమార్తెతో సరదాగా సమయం గడిపేందుకు ప్రతి రెండు వారాలకు ఒకసారి తిరువనంతపురం వచ్చి అక్కడ అద్దెకు తీసుకున్న ఇంట్లో ఉండేవాడు. అయితే, ఆయన తనతో ఉన్న 15 రోజుల వ్యవధిలో ఒక్కరోజు కూడా పాపకు ఇంట్లో వండిన ఆహారం పెట్టలేదని పూర్తిగా బయటి హోటళ్ల ఆహారాన్నే పెట్టాడనే విషయం సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది.

Also Read: Hyderabad City: హైదరాబాద్‌కు జైకొడుతున్న జనాలు.. ఎందుకిలా!

బాలిక ఆరోగ్యం, వికాసానికి ఇంటి భోజనమే మేలు హోటళ్లు, రెస్టారెంట్ల ఆహారాన్ని ప్రతిరోజు తినడం వలన ఆరోగ్యానికే ముప్పు కలిగిస్తుంది. అలాంటిది ఎనిమిదేళ్ల చిన్నారికి అది ఎంత హానికరం చేస్తుందో అని జస్టిస్ సందీప్ మెహతా వ్యాఖ్యానించారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యం, ఎదుగుదల, వికాసానికి ఇంట్లో వండిన పౌష్టికాహారం చాలా అవసరమని, కానీ ఆ పోషణను అందించే స్థితిలో తండ్రి లేరని ధర్మాసనం అభిప్రాయపడింది.

తండ్రికి కుమార్తెపై ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, ఆయన ఇంట్లో ఉన్న వాతావరణం, పరిస్థితులు బాలిక శ్రేయస్సుకు, ఎదుగుదలకు అనుకూలంగా లేవని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా, ఇంట్లో ఉండే సమయంలో తండ్రి తప్ప పాపకు తోడుగా మరెవరూ లేకపోవడం కూడా అంశంగా చెప్పవచ్చు. ఇదే కేసులో మూడేళ్ల కుమారుడి కస్టడీని కూడా నెలకు 15 రోజులు తండ్రికి అప్పగిస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపైనా సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

అంత చిన్న వయసులో తల్లి నుంచి వేరు చేయడం బాలుడి మానసిక, శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వ్యాఖ్యానించింది. తల్లి వద్ద లభించే భావోద్వేగ, నైతిక మద్దతుతో పోలిస్తే తండ్రి ఇచ్చే తాత్కాలిక మద్దతు చాలా తక్కువని కోర్టు స్పష్టం చేసింది. అక్క తండ్రితో ఉన్నప్పుడు తమ్ముడు కూడా ఆమె తోడును కోల్పోతున్నాడని పేర్కొంది. ఎదేమైనా పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యమని న్యాయస్థానం బావించిందని మరోసారి స్పష్టం చేసింది.

Also Read: Mega Family: వామ్మో.. అవకాయ పచ్చడికి పూజలు! చిరు భార్య సురేఖ ఏం చేస్తుందో చూశారా!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?