Rs.300 Crore Property She Allegedly Got Father In Law Killed Paid 1 Crore: కాలం మారింది, కాలంతో పాటు మనుషుల ధోరణిలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి. మానవత్వం మంట కలిసి పోతోంది. ఆస్తుల కోసం కన్నబిడ్డలు, కోడల్లు తల్లిదండ్రులు, అత్తమామలనే కనికరం లేకుండా వారి పాలిట విషసర్పాలుగా మారుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌కు చెందిన పురుషోత్తం పుట్టేవార్‌కు రూ. 300 కోట్ల ఆస్తి ఉంది. ఆయన కుమారుడు మనీష్ వృత్తిరిత్యా డాక్టర్, కోడలు అర్చన మనీష్ పుట్టేవార్ టౌన్ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తుంది. అయితే కొద్ది రోజుల క్రితం పురుషోత్తం భార్య శకుంతల ఆస్పత్రి పాలైంది. ఆమెకు సర్జరీ నిర్వహించగా, భార్యను చూసేందుకు పురుషోత్తం ఆస్పత్రికి వెళ్లారు. ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఆయన రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read:మోదీకి ఇటలీ ఉగ్ర ముప్పు
దర్యాప్తులో భాగంగా పురుషోత్తంను ఢీకొట్టి చంపిన కారును పోలీసులు గుర్తించి, డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఆ డ్రైవర్ అర్చన భర్త మనీష్ కారు డ్రైవర్‌గా తేలింది. దీంతో అతనిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా, అర్చనే ఈ హత్యకు ప్రధాన సూత్రధారి అని నిర్ధారణ అయింది. అంతేకాకుండా పురుషోత్తంను హత్య చేసేందుకు తనకు రూ. కోటి సుఫారీ ఇచ్చిందని డ్రైవర్ బాగ్డే అసలు మ్యాటర్ చెప్పడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనతో పాటు నీరజ్, సచిన్ ధార్మిక్‌కు ఈ హత్యలో ప్రమేయం ఉందన్నాడు. ఇక పురుషోత్తంను చంపేందుకే సెకండ్ హ్యాండ్ కారును అర్చన కొనుగోలు చేసిందని తేలింది. దీంతో అర్చనతో పాటు బాగ్డే, నీరజ్, ధార్మిక్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక ఇందులో పట్టుబడ్డ నిందితుల నుంచి రెండు కార్లు, బంగారు ఆభరణాలు, మొబైల్స్‌ను పోలీసులు సీజ్ చేశారు.