Rahul Gandhi
జాతీయం

Rahul Gandhi: లోక్ సభలో ఓటర్ల జాబితా రగడ.. చర్చకు పట్టుబట్టిన రాహుల్

Rahul Gandhi: రెండో విడత పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మెుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా లోక్ సభలో అధికార, విపక్షాల మధ్య వాడీ వేడీ చర్చ జరుగుతోంది. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ముఖ్యనాయకుడు రాహుల్ గాంధీ సభలో ఈ అంశాన్ని లేవనెత్తారు. దానిపై వెంటనే చర్చ చేపట్టాలని లోక్ సభలో పట్టుబట్టారు.

ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలతో పాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంటులో అన్నారు. అందులో అవతకతవకలు జరిగినట్లు ఆరోపించారు. దీనిపై చర్చ జరగాలని ప్రతిపక్షం కోరుకుంటోందని చెప్పారు. దేశంలోని మెుత్తం ఓటర్ల జాబితాపై చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మహారాష్ట్రతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఓటర్ల జాబితాపై చర్చ జరగాలన్నారు.

Also Read: Air India: ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఏం జరిగిందంటే?

గతేడాది హర్యానా అసెంబ్లీ ఫలితాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ .. ఓట్ల జాబితాపై అనుమానం వ్యక్తం చేసింది. ఓట్ల నమోదు ప్రక్రియలో భారీగా అవతకవతలు జరిగాయని ఆరోపించింది. అనంతరం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలపై కూడా కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల పదవీ విరమణ చేసిన మాజీ కేంద్ర ఎన్నికల కమిషన్ రాజీవ్ కుమార్‌పై విమర్శలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇదే అంశంపై లోక్‌‌సభలో చర్చ చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు