Tribute to PV
జాతీయం

National: దార్శనీకుడు పీవీ నరసింహరావు

PV Narasimha rao birth annaversy tributes by leaders:

పివి ఘాట్ వద్ద శుక్రవారం భారత రత్న, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు 103వ జయంతి వేడుకలు జరిగాయి. పివి ఘాట్ వద్ద పివి కుమార్తె వాణిదేవి, కుమారుడు ప్రభాకర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, కోదండరామ్, హైకోర్టు జడ్జి శ్రావణ్ కుమార్, తదితరలు నివాళులర్పించారు. అసెంబ్లీలో పివి నరసింహరావు చిత్రపటానికి సభాపతి గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డిలు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ భవన్‌లో పివి నరసింహరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎంఎల్సీ వాణీదేవి, ఎంఎల్ఎ జగదీశ్ రెడ్డి, మహమూద్ అలీలు పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రత్న దివంగత మాజీ ప్రధాని పి.వి 103 జయంతి సందర్భంగా గాంధీ భవన్ లో పి వి చిత్ర పటానికి కాంగ్రెస్ నాయకులు మాజీ ఎంపి వి. హనుమంతరావు, డిసిసి అధ్యక్షులు నర్సింహారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు సంగిశెట్టి జగదీష్, అల్లం భాస్కర్, భవాని రెడ్డి, రాపోలు జయ ప్రకాష్, ప్రేమలత అగర్వాల్, లింగం యాదవ్ తదితరులు నివాళులర్పించారు.

నివాళులర్పించిన ప్రముఖులు

దేశంలో ఆర్థిక సంస్క‌ర‌ణ‌లు ప్రవేశపెట్టిన దార్శనీకుడు పీవీ నరసింహరావు.. పీవీ నాయ‌క‌త్వం, జ్ఞానం అమోఘం.. ఈ ఏడాది ఆరంభంలో ఆయ‌న‌కు గౌర‌వం ఇస్తూ భార‌త ర‌త్న పుర‌స్కారాన్ని ప్ర‌క‌టించడం గర్వకారణం.
-ప్రధాని నరేంద్ర మోదీ,

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు పీవీ.భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేనిది.
-మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

అసమాన్యమైన తెలివితేటలతో తన బహుభాషా ప్రజ్ఞ పాఠవంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన గొప్ప మేధావి పివి ఒక కవిగా, కథకుడిగా, మేధావిగా, సంస్కరణశీలిగా పీవీ చరిత్రను దేశం ఎన్నడు మర్చిపోదు. భారతదేశం ఉన్నన్ని రోజులు ఆయన పేరును దేశ ప్రజలు గుర్తుంచుకుంటారు.
తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి పీవీ.
-మాజీ మంత్రి కేటీఆర్

విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేసిన మహోన్నతుడు పీవీ నరసింహరావు
– సీఎం చంద్రబాబు నాయుడు

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?