PM Modi Adampur Visit (Image Source: Twitter)
జాతీయం, లేటెస్ట్ న్యూస్

PM Modi Adampur Visit: పాక్‌ను నిద్రపోనిలేదు.. మన సత్తా ఎంటో చూపాం.. ప్రధాని మోదీ

PM Modi Adampur Visit: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పంజాబ్ లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ ను సందర్శించారు. ఆపరేషన్ సిందూర్, భారత్ – పాక్ కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో ప్రధాని ఈ పర్యటన చేపట్టారు. యుద్ధం ముఖ్యభూమిక పోషింటిన ఆదంపూర్ లో పర్యటించి సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యాన్ని నింపారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాక్ తో యుద్ధం నేపథ్యంలో భారత్ మాతాకీ జై నినాదం శత్రువుల చెవుల్లో మార్మోగిందని అన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేయాలని మన సైన్యం శపథం చేసిందని పేర్కొన్నారు. సైన్యం చూపిన శక్తి సామర్థ్యాలను ఎంత పొగిడినా తక్కువేనని ప్రధాని ప్రశంసించారు.

Also Read: Pakistan War Statement: భారత్‌తో యుద్ధం.. తొలిసారి పెదవి విప్పిన పాక్.. ప్రాణ నష్టంపై కీలక ప్రకటన

అణు బాంబులతో పాక్ నేతలు బెదిరించడం పైనా ప్రధాని మోదీ స్పందించారు. ఆ దేశం అణు బ్లాక్ మెయిల్ ను అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ఆపరేషన్ సిందూర్ లో భారత శక్తి సామర్థ్యాలు చూసి తన జీవితం ధన్యమైందని ప్రధాని అన్నారు. ఆపరేషన్ సిందూర్ నినాదం ప్రపంచమంతా మార్మోగిపోయిందని చెప్పారు. మన అక్కా చెల్లెళ్ల నుదిటి సిందూరం తుడిచినవాని నట్టింట్లోకి వెళ్లి నాశనం చేశామని ప్రధాని మోదీ ఉద్వేగ ప్రకటన చేశారు.

మన సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను మట్టిలో కలిపేసిందన్న ప్రధాని.. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని స్పష్టం చేశారు. మన దేశంలోని సామాన్యుల జోలికి వచ్చిన వారికి వినాశనమేనని ప్రధాని అన్నారు. మన డ్రోన్లు, క్షిపణలు తలుచుకుంటే పాక్ కు నిద్రపట్టదని చెప్పారు. నేటి నుంచి పదేళ్ల తర్వాత భారత పరాక్రమం గుర్చి చర్చ వస్తే మీ అందరి గురించే చర్చించాల్సి ఉంటుందని సైన్యాన్ని ఉద్దేశిస్తూ ప్రధాని అన్నారు. ఈ వేదిక నుంచి త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్ కు సెల్యూట్ చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ ఆపరేషన్‌లో భారత సమాజం మొత్తం సైన్యం వెంట నిలిచిందని, భారతీయులందరు సైనికుల కోసం ప్రార్థన చేశారని మోదీ అన్నారు.

Also Read This: Case Filed on Aghori: లేడీ అఘోరీ రాసలీలలు.. తెరపైకి మరో యువతి.. కేసు నమోదు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు