Narendra Modi: అవినీతి యువరాజులకు అధికారం ఇవ్వొద్దు
Narendra Modi (imagecredit:twitter)
జాతీయం

Narendra Modi: అవినీతి యువరాజులకు అధికారం ఇవ్వొద్దు: ప్రధాని మోదీ

Narendra Modi: బిహార్ ఎన్నికల నేపథ్యంలో గురువారం ముజఫర్‌పూర్, చాప్రాలో ప్రధాని మోదీ(Prime Minister Modi) ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ముందుగా ముజఫర్‌పూర్ వెళ్లిన ఆయన కాంగ్రెస్(Congress), ఆర్జేడలపై విరుచుకుపడ్డారు. ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నా, రోజూ ఎక్కడో ఒక చోట గొడవ పడుతున్నాయని, వాటి మధ్య సఖ్యత లేదని ఆరోపించారు. పరస్పర విభేదాలతో రెండు పార్టీల నేతలు నూనె, నీరు మాదిరిగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ దశాబ్దాలపాటు బిహార్‌(Bihar)ను పాలించి ఏం చేశాయని ప్రశ్నించారు.

Also Read: Deepika Padukone: దీపికాను ఇంకా ఇంకా అవమానిస్తున్నారెందుకు?

అధికారం ఇవ్వొద్దు

ఇక, తనపై చేస్తున్న విమర్శలపై ఘాటుగా స్పందించారు మోదీ(Modhi). అలాంటి వారికి వేరే పని ఉండదని, ఎప్పుడూ తనకు చెడ్డ పేరు తీసుకురావడం కోసమే ఆలోచిస్తుంటారని సెటైర్లు వేశారు. తర్వాత చాప్రాలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీకి చెందిన అవినీతి యువరాజులకు అధికారం ఇవ్వొద్దని ప్రజలను కోరారు. బిహార్ ప్రజల కల తన సంకల్పమని అన్నారు. ప్రచారంలో తనను దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారని, సామాన్యులను అవమానించకుండా ఉన్నత వర్గాల వారు తమ ఆహారాన్ని జీర్ణించుకోలేరని కీలక వ్యాఖ్యలు చేశారు. దళితులను, వెనుకబడిన వర్గాలను దుర్వినియోగం చేయడం వారి జన్మ హక్కు అంటూ మోదీ మండిపడ్డారు.

Also Read: Warangal: వరంగల్ ను అతలాకుతలం చేసిన మొంథా.. ముగ్గురు మృతి.. తెగిన రోడ్లు నిలిచిపోయిన రాకపోకలు

Just In

01

Bigg Boss Telugu 9: టాప్ 5తో ఆ తిక్క తిక్క గేమ్స్ ఏంటి బిగ్ బాస్? నవ్వుతున్నారు తెలుసా!

VB-G RAM G: ఎంజీఎన్ఆర్‌ఈజీఎస్ చట్టం తొలగింపుపై రాహుల్ గాంధీ ఆగ్రహం.. కీలక వ్యాఖ్యలు

Tungabhadra Dam: తుంగభద్ర నది పరివాహక ప్రాంత రైతులకు షాకింగ్ న్యూస్.. రబీ సాగుకు నీళ్లు బంద్..!

Panchayat Elections: తుది అంకానికి పంచాయతీ పోరు.. 3వ విడత పోలింగ్‌కి సర్వం సిద్దం!

Urea Production: కేంద్రం అలా చేస్తే రైతులకు ఎరువులు.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు