PM Narendra Modi: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేయడంతో, ప్రధాని నరేంద్ర మోదీ(PM Modhi) హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఈ విజయాన్ని సుపరిపాలన, అభివృద్ధి, సామాజిక న్యాయం విజయంగా అభివర్ణించారు. ఎన్నికల ఫలితాలపై మోదీ ‘ఎక్స్’ వేదికగా బిహార్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘సుపరిపాలన గెలిచింది. అభివృద్ధి గెలిచింది. ప్రజా సంక్షేమ స్ఫూర్తి గెలిచింది. సామాజిక న్యాయం గెలిచింది’ అని ఆయన పేర్కొన్నారు. బిహార్ అభివృద్ధి కోసం కూటమి ట్రాక్ రికార్డును, భవిష్యత్ విజన్‌ను చూసిన తర్వాతే ప్రజలు ఎన్డీఏకు భారీ మెజారిటీని ఇచ్చారని మోదీ అన్నారు. సీఎం నితీష్ కుమార్(CM Nitish Kumar), కూటమిలోని మిత్రపక్షాలైన చిరాగ్ పాశ్వాన్ (ఎల్జేపీ), జితన్ రామ్ మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బిహార్ ప్రజలు ఇచ్చిన ఈ తిరుగులేని తీర్పు తమను మరింత శక్తివంతం చేస్తుందని, కొత్త సంకల్పంతో రాష్ట్రానికి సేవ చేయడానికి ఇది దోహదపడుతుందని ప్రధాని హామీ ఇచ్చారు.
Also Read: Padmanabha Reddy: ఓవర్సీస్ విద్యా నిధిని పునఃపరిశీలించాలి.. సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ!
కార్యకర్తల కృషికి ప్రశంసలు
ఎన్డీఏ విజయం వెనుక ఉన్న ప్రతి కార్యకర్త కృషిని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ‘విశ్రాంతి లేకుండా పనిచేసిన, ప్రజల్లోకి వెళ్లి మా అభివృద్ధి అజెండాను వివరించిన, ప్రతిపక్షాల అబద్ధాలను దీటుగా ఎదుర్కొన్న ఎన్డీఏ కార్యకర్తలందరికీ నా కృతజ్ఞతలు. రాబోయే కాలంలో బిహార్ అభివృద్ధిపై, మౌలిక సదుపాయాలకు కొత్త గుర్తింపు ఇవ్వడంపై, అలాగే రాష్ట్ర సంస్కృతిని బలోపేతం చేయడంపై మరింత చురుకుగా పనిచేస్తాం. యువశక్తికి, మహిళా శక్తికి సంపన్నమైన జీవితం కోసం విస్తృత అవకాశాలు దక్కేలా చూస్తాం’ అని మోదీ ఎక్స్‌లో వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ విజయం బీజేపీకి రాష్ట్రంలో తొలిసారిగా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. అంతేకాదు సొంతంగా ఎదగడానికి కూడా మార్గం సుగమం చేసినట్టు అయ్యింది.
Also Read: Tata Motors: టాటా మోటార్స్‌కి మరో పెద్ద దెబ్బ.. 867 కోట్లు నష్టం
