MEA Briefing On Operation Sindoor
జాతీయం

Operation Sindoor: పాక్‌కు మరో ఊహించని చావు దెబ్బ.. షాకింగ్ విషయాలు మీకోసం..

Operation Sindoor: భారత్‌-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకున్నాయి. ‘ఆపరేషన్‌ సింధూర్‌’ జరిగిన నాలుగో రోజు కూడా పాకిస్థాన్‌ ఓవరాక్షన్ చేస్తూనే ఉంది. పాపిస్థాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలకు భారత్​ఊహించని రీతిలోనే చావు దెబ్బ కొడుతూ వస్తోంది. సరిహద్దుల వెంట 26 ప్రదేశాలపై డ్రోన్లు, శతఘ్నులతో పాక్‌ దాడి చేసింది. ఇందుకు దీటుగా ప్రతిస్పందించిన భారత్‌.. పాక్‌లోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై ఓ రేంజిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ సైన్యం హెడ్‌క్వార్టర్‌‌గా ఉన్న రావల్పిండి చక్లాలలోని నూర్‌ఖాన్‌, చక్వాల్‌లోని మురీద్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లో ఉన్న రఫీకి వైమానిక స్థావరాల్లో భారత్ పేలుళ్లు జరిపింది. ఇందుకు స్పందించిన పాక్ తాము కూడా సరైన రీతిలోనే బదులిస్తామని.. ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ అంటూ దాడులు మొదలుపెట్టింది. వాస్తవానికి.. శుక్రవారం పగటిపూట అంతా ప్రశాంతంగా ఉన్నప్పటికి పాక్ మాత్రం కవ్వింపు చర్యలకు పాల్పడింది. శుక్రవారం రాత్రి మరోసారి భారత్‌పై దుస్సాహసానికి ఒడిగట్టి.. బారాముల్లా నుంచి భుజ్‌ వరకు 26 ప్రాంతాలపైకి వరసగా పాక్ డ్రోన్లు పంపింది. ముఖ్యంగా.. శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టు, అవంతీపొరా వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ డ్రోన్లు పంపింది. అయితే భారత సైన్యం విజయవంతంగా ఆ డ్రోన్లను నిర్వీర్యం చేసి ‘దటీజ్ ఇండియా’ అంటూ సత్తా చాటుకుంది. ఈ దాడులను ఇండియా ఎలా ఎదుర్కొంటోంది? పాక్ చేసిన దుశ్చర్యలేంటి? భారత్ ఎలా బదులిచ్చింది? అనే విషయాలను రక్షణ శాఖ మీడియా మీట్ నిర్వహించి వివరాలు వెల్లడించింది.

పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాం..
పాకిస్థాన్‌ పదే పదే రెచ్చగొట్టేలా చర్యలకు పాల్పడుతోందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు. ‘ పాకిస్థాన్ ఇవాళ ఉదయం కూడా దాడులు చేసింది. పాక్ సైన్యం సామాన్య ప్రజలను, వారి ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని దాడులు చేస్తోంది. పాక్ దాడులకు భారత సైన్యం గట్టిగానే జవాబు ఇస్తోంది. దాడులతో పాకిస్థాన్‌ ఉద్రిక్తతలు పెంచాలని చూస్తోంది. పాకిస్థాన్‌ దాడులను భారత సైన్యం సమర్థంగా తిప్పుకొడుతోంది. శ్రీనగర్‌, ఉధంపూర్‌, బటిండా, భుజ్‌‌లో దాడులకు పాల్పడుతోంది. పలుచోట్ల పాఠశాలలు, వాయుసేన ఆస్పత్రులపైన కూడా దాడులు చేస్తోంది. శ్రీనగర్‌ నుంచి నలియా వరకు పాక్‌ దాడులకు పాల్పడుతోంది. భుజ్‌, బటిండాలోని ఎయిర్‌స్టేషన్లపై.. పంజాబ్‌లోని ఎయిర్‌బేస్‌లను పాక్‌ లక్ష్యంగా చేసుకుంది. శ్రీనగర్‌, ఉధంపుర్‌లోని ఆస్పత్రులపైనా పాక్‌ దాడి చేసింది. పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో ఎయిర్‌లాంచర్లను ధ్వంసం చేశాం. సామాన్య పౌరులకు సాధ్యమైనంత వరకూ తక్కువ నష్టం కలిగేలా పాక్‌పై దాడులు చేశాం. భారత్‌లోని కీలక వ్యవస్థలపై దాడులు చేశామని పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తోంది. భారత సైనిక బలగాలు పూర్తిస్థాయిలో సంసిద్ధంగానే ఉన్నాయి. పాకిస్థాన్‌ డ్రోన్లు, లాంగ్‌రేంజ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో దాడులు చేస్తోంది. భారత్‌లోని 26 ప్రాంతాల్లో పాకిస్థాన్‌ డ్రోన్లతో దాడి చేసింది. నిన్న అర్ధరాత్రి 01.40 గంటల తర్వాత పాకిస్థాన్‌ దాడులు తీవ్రతరం చేసింది. పాక్‌లోని సాంకేతిక మౌలిక సదుపాయాలు, కమాండ్‌ కంట్రోల్ సెంటర్లు లక్ష్యంగా భారత్ కూడా దాడులు చేసింది. ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో పాక్‌ కీలక స్థావరాలపై దాడులు చేశాం. పాకిస్థాన్ సైనిక బలగాలు ముందుకు వస్తున్నట్లు గమనించి.. తిప్పికొట్టాం. పాకిస్థాన్‌ తన అసత్య ప్రచారాలను కొనసాగిస్తూ వస్తోంది. భారత్‌లోని పలు ఎయిర్‌బేస్‌లను ధ్వంసం చేసినట్లు పాక్‌ చేస్తున్న ప్రచారం ముమ్మాటికీ అవాస్తవం. పాక్‌ తప్పుడు ప్రచారాన్ని ఆధారాలతో మన సైన్యాధికారులు తిప్పికొడుతున్నారు’ అని విక్రమ్‌ మిస్రీ మీడియాకు వివరించారు.

Operation Sindoor
Operation Sindoor

భారత్ సమన్వయంతో ఉన్నా..
‘ పాకిస్తాన్ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉంది. 24 చోట్ల ఫైటర్ జెట్లతో దాడికి ప్రయత్నించింది. పాకిస్తాన్ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోంది. శ్రీనగర్, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసింది. లాంగ్‌ రేంజ్‌ క్షిపణులు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో పాకిస్తాన్‌ దాడులు చేస్తోంది. పాకిస్థాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నాం. పాకిస్థాన్ ఎయిర్ బేస్‌లపై భారత్ ప్రతిదాడులు చేసింది. భారత్ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోంది. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్ క్షిపణులను వాడుతున్నాం. పాక్‌ ఎయిర్‌బేస్‌లను గట్టిగా దెబ్బకొట్టాం. S-400ను ధ్వంసం చేశామంటూ పాక్ తప్పుడు ప్రచారం చేసింది. పాక్‌ దాడులు చేసిన ప్రతీచోటా భారత్‌ గట్టిగానే ప్రతిఘటించింది’ అని కల్నల్ సోఫియా ఖురేషి వెల్లడించారు.

పాక్ ఏమీ మారలేదు..!
‘ పశ్చిమ సరిహద్దుల్లో పాక్‌ మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది. పాక్ ఫైటర్ జెట్లు భారత భూభాగంలోకి పలుమార్లు వచ్చాయి. పంజాబ్‌లోని పలు ఎయిర్ బేస్‌లను లక్ష్యంగా చేసుకుంది. శ్రీనగర్ స్కూళ్లు, ఆస్పత్రులను లక్ష్యంగా చేసుకుంది. రాడర్ సెంటర్లు, వెపన్ స్టోరేజ్ సెంటర్లను కూడా పాక్ టార్గెట్ చేసింది. భారత్ కేవలం పాకిస్థాన్ మిలిటరీ కేంద్రాలను మాత్రమే టార్గెట్‌గా చేస్తూ దాడులు చేసింది. భారత్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లకు ఎలాంటి హాని జరగలేదు’ అని వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ తెలిపారు.

రాత్రి నుంచి ఇప్పటి వరకూ..
కాగా, శుక్రవారం రాత్రి నుంచి పాక్ హడావుడి చేస్తూనే ఉన్నది. తొలుత ఎల్‌వోసీలో పాక్‌ కాల్పులకు తెగబడింది. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ సైన్యం కాల్పులు జరిపింది. భారత పోస్టులపైనా భారీగా కాల్పులు జరిపింది. పీవోకే నుంచి కాల్పులు పాక్‌ సైన్యం జరిపింది. మరోవైపు.. జలంధర్ ఆర్మీ క్యాంప్ సమీపంలో నిన్న అర్థరాత్రి ప్రాంతంలో రెండుసార్లు డ్రోన్ల కదలికలను భారత్ గుర్తించింది. అప్రమత్తమైన భారత వైమానిక దళం డ్రోన్‌ దాడులను తిప్పికొట్టింది. కంగ్నివాల్‌లో కారుపై పడిన రాకెట్‌లాంటి వస్తువు పడింది. మరోవైపు ఝండుసింఘా గ్రామంలో డ్రోన్ల పేల్చివేసింది. ఇంటిబయట నిద్రిస్తున్న వ్యక్తిపై డ్రోన్ శకలాలు పడ్డాయి. పాక్‌‌లోని కరాచీ ఎయిర్‌పోర్టు లాక్‌డౌన్‌ అయ్యింది. ఎయిర్‌పోర్టు నుంచి ప్రయాణికులను తరలించారు. ఇదిలా ఉంటే.. కశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున పాకిస్థాన్ జరిపిన కాల్పుల్లో సీనియర్ ప్రభుత్వ అధికారి మృతి చెందారు. మరో ఇద్దరు సిబ్బందికి కూడా తీవ్ర గాయాలైనట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు జమ్ము కశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా వెల్లడించారు. అదనపు జిల్లా అభివృద్ధి కమిషనర్ రాజ్ కుమార్ తప్పా మరణించారని సీఎం పేర్కొన్నారు.

 

 

 

 

 

 

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు