Swami Nithyananda: వివాదస్పద ఆధ్యాత్మిక గురువుగా స్వామి నిత్యానంద (Swami Nithyananda)కు పేరుంది. తమిళనాడు (Tamilnadu)కు చెందిన ఆయన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ (United States Of Kailash) పేరుతో సొంత దేశాన్ని ఏర్పాటు చేసుకొని యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఐక్యరాజ్యసమితి (UNO) సమావేశాలకు సైతం ఆయన ప్రతినిధులు హాజరై ప్రసంగించడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా, నిత్యానందకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
వివాదాస్పద స్వామి నిత్యానంద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 47 ఏళ్ల స్వామిజి చనిపోయారనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ విషయాన్ని స్వయానా ఆయన మేనల్లుడే తెలిపాడు. దీంతో, ఈ న్యూస్ అందరికి చేరింది. ఇంకేముంది ఈ వార్త నిజమనే నమ్మి ఆయన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియంలో టికెట్ల లొల్లి.. వెళ్లిపోతామన్న సన్ రైజర్స్ టీమ్.. హెచ్ సీఏ ఆన్సర్ ఇదే!
ఈ ప్రచారాన్ని ఆయన స్థాపించిన ‘కైలాస’ దేశం ఖండించింది. నిత్యానంద బతికే ఉన్నారని, ఆరోగ్యంగానే ఉన్నారని ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఆయన ఏప్రిల్ 2న సాయంత్రం 7 గంటలకు (న్యూయార్క్ కాలమానం) ప్రత్యక్ష ప్రసంగం చేస్తారని వెల్లడించింది. కాగా, హిందూ ధర్మ పరిరక్షణకు నిత్యానంద ప్రాణ త్యాగం చేశారని ఆయన మేనల్లుడు సుందరేశ్వరన్ చెప్పినట్టుగా ఏప్రిల్ 1న పలు రకాల వచ్చాయి.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. అంతేకాదు, నిత్యానంద బతికే ఉన్నట్టు ప్రూఫ్ కోసం మార్చి 30న జరిగిన ఉగాది వేడుకల్లో జరిగిన వీడియో లింక్‌ను కైలాస దేశం అటాచ్ చేసింది. ప్రజలను ఏప్రిల్ ఫూల్ చేసేందుకే ఇలా అబద్దాలను ప్రచారం చేస్తున్నారని కొందరు మండిపడుతున్నారు. కొందరు కావాలనే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ప్రకటనలో పేర్కొంది.