national News five people died family after jumping abandoned well save cat ahmednagar
జాతీయం

National News: పిల్లి కోసం ప్రాణాలు అర్పించిన ఫ్యామిలీ

Save Cat Ahmednagar: సాధారణంగా మనం సాదుపిల్లి కోసం మనం ఏం చేస్తాం, మహా అయితే దానికేం కాకుండా చూసుకుంటాం. లేదంటే దాని బాగోగులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాం.కానీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో ఘోరం జరిగింది. ఓ బావిలో పడిన ఓ సాదు పిల్లిని రక్షించబోయి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఆ నగరంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పిల్లిని రక్షించేందుకు బయోగ్యాస్ పిట్‌లోకి దిగిన ఐదుగురు వ్యక్తులు చనిపోయిన ఘటన ఆ నగరంలో కలకలం రేపింది.

వారు సాదుపిల్లి అంటే వారికెంతో ఇష్టం. దానికోసం ఎవరూ చేయని సాహసం చేసి ఆఖరికి తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. పిల్లిని రక్షించడానికి కుటుంబం మొత్తం బావిలోకి దిగింది. ఆరుగురు ఒకరి తర్వాత మరొకరు బావిలోకి ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా అందులోకి దూకారు. దీంతో బావిలో దూకిన ఐదుగురు ఊపిరాడక చనిపోయారు. దీంతో మృతిచెందిన మృతదేహాలను రెస్క్యూ టీమ్ స్వాధీనం చేసుకుందని అహ్మద్‌నగర్‌లోని నెవాసాపోలీస్ స్టేషన్ సీనియర్ పోలీసు అధికారి ధనంజయ్ జాదవ్ తెలిపారు.

Also Read:లోయలో పడ్డ బస్సు, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అందులోకి దూకిన బాధితులు ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో బావిలోకి దిగి తమ తమ ప్రాణాలని కోల్పోయారని వెల్లడించారు. నడుముకి తాడు కట్టుకుని బావిలోకి ప్రవేశించిన వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడని అతణ్ణి ఆసుపత్రిలో చేర్చినట్టు చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరుగుతోందని వెల్లడించారు. మృతులను మాణిక్ గోవింద్ కాలే, సందీప్ మాణిక్ కాలే, బబ్లూ అనిల్ కాలే, అనిల్ బాపురావ్ కాలే, బాబాసాహెబ్ గైక్వాడ్‌లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కుటుంబంలో చిన్న కుమారుడు అయినటువంటి విజయ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఇక ఇదిలా ఉంటే బావి లోపలికి దిగిన తరువాత ఊపిరాడటం లేదని ఫిర్యాదు చేయడంతో స్థానికులు వెంటనే పోలీసులకు, నిపుణులకు సమాచారం అందించారు. దీంతో సహాయక బృందాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌లు ఆపరేషన్‌ను పూర్తి చేయడానికి 5 గంటలకు పైగా పట్టిందనీ ఫైర్ అయ్యారు. వీరి నిర్లక్ష్యం మూలంగా వారు ప్రాణాలను కోల్పోవాల్సిన పరిస్థితి నెలకొందని అక్కడి స్థానిక ప్రజలు అధికారులపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారని.. అంతేకాకుండా బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక ప్రజలు అధికారులను డిమాండ్ చేశారు.

Just In

01

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?