Delhi CM Aravind Kejriwal
జాతీయం

Delhi CM : ఢిల్లీ సీఎంపై హైకోర్టులో పిటిషన్, ఐరాస భారత్‌కు కీలక సూచన

Delhi CM Aravind Kejriwal : ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోస్ట్‌కి ముప్పుతో పాటు మద్దతు కూడా లభిస్తోంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిన విషయమే. జైలులో ఉండి పాలించే అంశంపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ దాఖలు అయింది.హైకోర్టులో హిందూసేన శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ని సీఎం పోస్ట్ నుంచి తక్షణమే తప్పించాలని అందులో కోరింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని తన పదవి నుంచి తప్పించాలని లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సెనాకు ఆదేశాలివ్వాలని హిందూసేన తన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పేర్కొంది.

లెప్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో కేంద్రప్రభుత్వం పాలనా వ్యవహారాలను చూడాలని తెలిపింది. ఇక ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ని గురువారం ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు కావడం తీవ్ర కలకలంగా మారింది. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి జ్యుడిషియల్ కస్టడీ లేదంటే పోలీస్ కస్టడీలో ఉంటూ పరిపాలించే అవకాశం లేదని హిందూసేన పేర్కొంది. ఆ విధంగా పరిపాలించాలని రాజ్యాంగంలో ఎక్కడ లేదని హిందూసేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అభిప్రాయపడ్డాడు. ఇక ఇదిలా ఉంటే.. లిక్కర్ స్కాంలో ఈడీ అరెస్టు చేసిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కు అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా, జర్మనీ వంటి అగ్రదేశాలు కేజ్రివాల్ అరెస్టును తప్పుబడుతూ భారత్ కు నిష్పాక్షికంగా వ్యవహరించాలని సూచించాయి.

Read Also: చాయ్ పే చర్చలో పీఎం మోదీ, బిల్ గేట్స్

ఇప్పుడు ఐక్యరాజ్యసమితి సైతం ఆయన అరెస్టుపై స్పందించింది. భారత్‌లో మానవహక్కుల్ని కాపాడాలని పిలుపునిచ్చింది. దీంతో కేంద్రం మరింత ఇరుకునపడుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందిస్తూ ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్.. భారత్‌లో ప్రతీ ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలు ఉన్న ఏ దేశంలోనైనా, రాజకీయ నేతలు, పౌరులతో సహా ప్రతి ఒక్కరి హక్కులు రక్షించబడతాయని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. హక్కులు ఉంటేనే ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, న్యాయమైన వాతావరణంలో ఓటు వేయగలరన్నారు. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసి కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన నేపథ్యంలో భారతదేశంలో నెలకొన్న రాజకీయ అశాంతిపై ఆయన సమాధానంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు