Cyber Crime Alert: నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ కొత్త హెచ్చరికను విడుదల చేసింది. ఇటీవల USSD ఆధారిత కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ వేగంగా పెరుగుతున్నట్టు పేర్కొంది. ఈ మోసం వల్ల బ్యాంక్ ఖాతాలు హ్యాక్ అవడం, ఆర్థిక మోసాలు జరగడం ఎక్కువవుతున్నాయని తెలిపింది.
ఈ అలర్ట్‌ను ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) పరిధిలో విడుదల చేశారు. ఇంటర్నెట్ అవసరం లేకుండానే, మొబైల్లో ఉన్న సాధారణ టెలికాం ఫీచర్లను దుర్వినియోగం చేసి మోసగాళ్లు భద్రతా వ్యవస్థలను దాటేస్తున్నారని అధికారులు హెచ్చరించారు.
సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఎక్కువగా పరిచయం లేని USSD కోడ్స్ పై ఉన్న అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుంటున్నారు. ఇవి సాధారణంగా టెలికాం సేవల కోసం ఉపయోగించే కోడ్స్ కావడం వల్ల చాలామంది వాటిని ప్రమాదకరం అనుకోకుండా డయల్ చేస్తున్నారని నివేదిక పేర్కొంది.
USSD కాల్ ఫార్వర్డింగ్ స్కామ్ ఎలా జరుగుతుంది?
ఈ మోసంలో నేరగాళ్లు తమను తాము డెలివరీ ఏజెంట్లుగా పరిచయం చేసుకుని బాధితులకు కాల్ చేస్తారు. పార్సెల్ డెలివరీ కన్ఫర్మేషన్ లేదా రీషెడ్యూల్ చేయాల్సి ఉందని చెప్పి నమ్మకం కలిగిస్తారు. ఆ తర్వాత కాల్‌లోనే లేదా SMS ద్వారా, సాధారణంగా 21తో ప్రారంభమయ్యే ఒక USSD కోడ్ ను డయల్ చేయమని చెబుతారు. ఆ కోడ్ చివర మోసగాళ్లకు చెందిన మొబైల్ నంబర్ ఉంటుంది.
బాధితుడు ఆ కోడ్‌ను డయల్ చేసిన వెంటనే, అతని ఫోన్లో కాల్ ఫార్వర్డింగ్ యాక్టివేట్ అవుతుంది. దీంతో బ్యాంకుల నుంచి వచ్చే కాల్స్, OTP వెరిఫికేషన్ కాల్స్, అలాగే WhatsApp, Telegram వంటి యాప్స్ నుంచి వచ్చే అథెంటికేషన్ కాల్స్ అన్నీ నేరుగా మోసగాళ్ల ఫోన్‌కు వెళ్లిపోతాయి.
Also Read: Naa Anveshana: అమ్మాయి చీర కట్టు విధానం గురించి కాదు.. అబ్బాయి మైండ్ సెట్ మారాలి.. నా అన్వేష్
దీంతో వారు లావాదేవీలను ఆమోదించడం, పాస్వర్డ్స్ మార్చడం, ఖాతాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరుగుతోంది. బాధితుడికి విషయం తెలిసేలోపే నష్టం జరిగిపోతుందని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

