Modi And Bill Gates In Chai Pay Discussion
జాతీయం

PM Modi, Bill Gates : చాయ్ పే చర్చలో పీఎం మోదీ, బిల్ గేట్స్

Modi And Bill Gates In Chai Pay Discussion : దేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్, అగ్రికల్చర్ వంటి తదితర రంగాల్లో టెక్నాలజీ పరంగా కీ రోల్ పోషిస్తోందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అయితే, కృత్రిమ మేధస్సుతో కొత్త సవాళ్లు ఎదురవుతున్నట్లు తెలిపారు. ప్రధాని మోదీ, టెక్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌ శుక్రవారం చాయ్‌ పే చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్‌ టెక్నాలజీ సహా పలు రంగాలపై వీరిద్దరూ సుధీర్ఘకాలం పాటు చర్చించారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి నేను ఇష్టపడతా. ఇందులో నేను నిపుణుడిని కాదు. కొత్త విషయాలను తెలుసుకోవడానికి చాలా ఉత్సాహంగా ఉంటా. మా అధ్యక్షతన జరిగిన జీ20 సదస్సులో ఏఐ టెక్నాలజీని వినియోగించుకున్నాం. కృత్రిమ మేధతో హిందీలో చేసిన నా ప్రసంగాన్ని తమిళంలోకి అనువదించాం. ఏఐ శక్తిమంతమైనదే. కానీ.. దాన్ని మ్యాజిక్‌ టూల్‌గా ఉపయోగిస్తే అది తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. సరైన శిక్షణ లేకుండా దీన్ని అందిస్తే దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది. తప్పుడు వ్యక్తుల చేతుల్లో పడితే వక్రమార్గంలో పయనిస్తుంది.

భారత్‌ లాంటి ప్రజాస్వామ్య దేశంలో డీప్‌ఫేక్‌ను ఎవరైనా వినియోగించొచ్చు. డీప్‌ఫేక్‌తో నా గొంతును కూడా అనుకరించారని మోదీ తెలిపారు.దీనికి బిల్‌గేట్స్ బదులిస్తూ.. కృత్రిమ మేధ వినియోగంలో మనం స్టార్టింగ్ దశలో ఉన్నాం. మనం కష్టం అనుకున్నవి సులువుగా చేస్తుంది. తేలికని భావించే వాటిలో విఫలమవుతోంది. ఏఐ అనేది ఒక పెద్ద ఛాన్స్. దాంతో కొన్ని సవాళ్లూ ఉన్నాయని అన్నారు. అప్పుడు మోదీ స్పందిస్తూ.. డీప్‌ ఫేక్‌ కంటెంట్‌ ఏఐతో సృష్టించారని గుర్తించడం చాలా అవసరం. అందుకోసం కంటెంట్‌కు వాటర్‌మార్క్‌లు ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అప్పుడు ఎవరూ దీన్ని తప్పుదోవ పట్టించలేరని పేర్కొన్నారు.

Read Also: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌, ఆరుగురు నక్సల్స్ హతం

ఈ సందర్భంగా.. నమో యాప్‌లో ఏఐ వినియోగంపై గేట్స్‌కు ప్రధాని అవేర్నెస్ కల్పించారు. ఈ యాప్‌లో సెల్ఫీ తీసుకుంటే అందులో ఉన్న ముఖ చిత్రాన్ని గుర్తించి ఆ వ్యక్తి పాత ఫొటోలను రిట్రీవ్‌ చేస్తుందని చెప్పారు. తన ఫోన్‌ను గేట్స్‌కు ఇచ్చి నమో యాప్‌లో సెల్ఫీ దిగమని చెప్పారు. ఆ తర్వాత గతంలో వీరిద్దరూ దిగిన పలు ఫొటోలు రావడాన్ని ప్రధాని చూపించారు. డిజిటల్‌ రంగంలో భారత్‌ చాలా మార్పులు తీసుకొచ్చింది. నమో డ్రోన్‌ దీదీ పథకం విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు సైకిల్‌ నడపడం కూడా రాని మహిళలు.. ఇప్పుడు పైలట్లుగా, డ్రోన్లు ఆపరేట్‌ చేసే స్థాయికి ఎదిగారు. చిరుధాన్యాల వల్ల అధిక ప్రయోజనం కలుగుతుంది. తక్కువ నీటితో ఎరువులు లేకుండా వీటిని సాగు చేయొచ్చు. దీంతో చిన్న రైతుల జీవితాల్లో మార్పులు వచ్చాయి. డిజిటల్‌ సాంకేతికతతో సామాన్యులకు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం లభిస్తుంది. ఒకప్పుడు ప్రభుత్వానికి, పేదలకు మధ్య అంతరం ఉండేది. ఇప్పుడు డిజిటల్‌ టెక్నాలజీతో నేరుగా ప్రభుత్వం నుంచే పేదవాడికి అన్ని అందుతున్నాయని మోదీ బిల్ గేట్స్ కి వివరించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!