MLA Attack
జాతీయం, లేటెస్ట్ న్యూస్

MLA Attack: పప్పు పంచాయితీ.. రెచ్చిపోయిన ఎమ్మెల్యే

MLA Attack: హాస్టళ్లు, వసతి గృహాల్లోని భోజనం నాసిరకంగా ఉండొద్దని ప్రభుత్వాలు చెబుతూ ఉంటాయి. కాంట్రాక్టర్లు వింటూ ఉంటారు. తర్వాత యథా పరిస్థితే కొనసాగుతుంది. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఏ రాష్ట్రం చూసినా ఇదే పరిస్థితి. అయితే, మహారాష్ట్రలో తనకే నాసిరకం భోజనం పెడతారా అంటూ ఓ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. క్యాంటిన్ సిబ్బందిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ముఖ్యంగా పప్పు వాసన వస్తున్నదని, తన ఆరోగ్యం దెబ్బతిన్నదని ఫుల్ ఫైరయ్యారు. నాసిరకం భోజనం ఉంటే కాంట్రాక్టర్‌ లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు, అంతేకానీ ఇలా దాడికి పాల్పడడం ఏంటని పలువురు ప్రశ్నిస్తుండగా, దానినీ ఎమ్మెల్యే సమర్ధించుకోవడం వైరల్ అవుతున్నది.

అసలేం జరిగిందంటే?

మహారాష్ట్రలో ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ ముంబైలో ఉంటూ సమావేశాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ప్రభుత్వ అతిథి గృహంలో ఉంటూ అసెంబ్లీకి వెళ్తున్నారు. అయితే, మంగళవారం రాత్రి ఆయనకు క్యాటీన్ సిబ్బంది భోజనం వడ్డించగా, అది నాసిరకంగా అనిపించింది. పప్పు వాసన వస్తుండడంతో సిబ్బందిని పిలిచారు. వారిని వాసన చూడమని అడగడంతో వారు బాగానే ఉన్నదని సమాధానం ఇచ్చారు. దీంతో రెచ్చిపోయిన ఎమ్మెల్యే గొడవకు దిగారు. వాసన వస్తుంటే లేదంటారా అంటూ ఆపరేటర్‌పై చేయి చేసుకున్నారు. అతడి ముఖంపై పిడిగుద్దల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయి, అవి బయటకు రావడంతో ఎమ్మెల్యే తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Read Also- Robbery in ATM: స్పెషల్ డ్రైవ్ చేసిన చోటే ఏటీఎం చోరీ.. దొంగలు ఎలా తప్పించుకున్నారంటే!

నేను చేసిన దాంట్లో తప్పేముంది- ఎమ్మెల్యే

ఆహారం సరిగ్గా లేకపోతే దాడి చేయడం కరెక్టేనా అని ఎమ్మెల్యేను అడిగితే, ‘‘ఇది ప్రభుత్వ క్యాంటీన్. వేలాది మంది వస్తుంటారు. నేను ప్రజా ప్రతినిధిని. ఎవరైనా ప్రజాస్వామ్య భాషను అర్థం చేసుకోకపోతే, నా భాషలోనే సమాధానం ఉంటుంది. ఇది శివసేన శైలి. మాకు బాలా సాహెబ్ థాక్రే నేర్పించింది ఇదే. దాన్నే ఇక్కడ ఉపయోగించాను’’ అని తన దాడిని ఎమ్మెల్యే సమర్ధించుకున్నారు. తాను కరాటే, రెజ్లింగ్‌లో ఛాంపియన్ అని, కత్తులు కూడా ఉపయోగించగలనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విస్ట్ ఏంటంటే, బుధవారం అదే క్యాటీన్ నుంచి పప్పు, ఇతర కూరల ప్యాకెట్లను సంజయ్ గైక్వాడ్ అసెంబ్లీకి తీసుకెళ్లారు.

వివాదాలకు కేరాఫ్

సంజయ్ గైక్వాడ్‌కు వివాదాలు కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంటారు. గతంలోనూ పలుమార్లు దాడులకు పాల్పడిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతేడాది లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నాలుకను నరికేస్తే బహుమతి ఇస్తానని సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత షిండే కార్యక్రమాల్లో పాల్గొనే కాంగ్రెస్ వాళ్లను కుక్కలతో పోల్చారు. ఆ సమయంలో ఈయనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

Read Also- No Marriage: పెళ్లి వద్దన్నందుకు దాడి.. ఇదేం పైశాచికత్వం రా బాబూ!

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?