Mamata Banerjee
జాతీయం

Mamata Banerjee : ఎన్నికల సంఘం ముందు నిరవధిక దీక్ష చేస్తా: మమతా బెనర్జీ

Mamata Banerjee : పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ సంచలన సవాల్ చేశారు. పశ్చిమబెంగాల్ లో తప్పుడు ఓటర్ల లిస్టు భారీగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ (Bjp) ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లను తీసుకొచ్చి తమ రాష్ట్రంలో కలుపుతోందంటూ ఆరోపించారు. దీనిపై ఈసీ (Ec) వెంటనే చర్యలు తీసుకోవాలని.. లేదంటే ఈసీ ఆఫీసు ముందు నిరవధిక దీక్షచేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం కోల్ కతాలోని టీఎంసీ (Tmc) పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీజేపీ బెంగాల్ లో గెలిచేందుకు అన్ని రకాల కుట్రలు చేస్తోందంటూ ఆరోపించారు. ఈసీ చీఫ్​ గా జ్ఞానేశ్ కుమార్ ను నియమించడాన్ని కూడా మమతా బెనర్జీ తప్పుబట్టారు. బీజేపీ ఎన్నికల వ్యవస్థలను కూడా మేనేజ్ చేస్తోందంటూ చెప్పుకొచ్చారు. నేరుగా గెలిచే ధైర్యం లేక.. వ్యవస్థల సాయంతో గెలవాలని చూస్తోందంటూ ఆమె ఆరోపించారు.

గతంలో మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రంలో కూడా ఇలాగే గెలిచారు అంటూ ఆమె ఆరోపించారు. త్వరలోనే దీనిపై పోరాడుతానని ఆమె స్పష్టం చేశారు. టీఎంసీ ఎవరికీ భయపడదని.. తాను పోరాటాలతోనే సీఎం అయినట్టు ఆమె గుర్తు చేసుకున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రాంతీయ పార్టీల బలంగా బాగా పెరిగిందని.. కాబట్టి తమను తక్కువ అంచనా వేయొద్దంటూ ఆమె సవాల్ విసిరారు.

Just In

01

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?