lok sabhas 2024
జాతీయం

National:స్పీకర్ ఎంపిక పై సర్వత్రా ఉత్కంఠ

  • స్పీకర్ ఎంపికపై ఎన్డీఏ సర్కార్ మల్లగుల్లాలు
  • విపక్షాలతో కుదరని ఏకాభిప్రాయం
  • చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవి కోసం ఎన్నిక
  • స్పీకర్ అభ్యర్థిని నిలబెట్టిన ఇండియా కూటమి
  • స్పీకర్ ఎంపికపై తగ్గేది లేదంటున్న ఇండియా కూటమి
  • బుధవారానికి వాయిదా పడ్డ స్పీకర్ ఎంపిక
  • ఇప్పటిదాకా ఏకగ్రీవంగానే జరిగిన స్పీకర్ ఎంపిక
  • ఏకగ్రీవానికి కేంద్ర మంత్రులను దించిన బీజేపీ
  • ఇండియా కూటమి నుంచి స్పీకర్ బరిలో నిలిచిన కాంగ్రెస్ ఎంపీ కే.సురేశ్
  • ఎన్టీయే తరపున స్పీకర్ పదవికి ఓం బిర్లా నామినేషన్

Loak Sabha Speaker election not accept unanimous by opposition parties:
కేంద్రంలో మూడో సారి అధికారాన్ని చేపట్టిన ఎన్టీఏ ప్రభుత్వం స్పీకర్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. గత రెండు పర్యాయాలు బీజేపీకి సొంత బలం ఉండటంతో స్పీకర్ పదవిని ఏకగ్రీవంగా చేశారు. అయితే ఈ సారి మాత్రం సంకీర్ణ ప్రభుత్వం కావడంతో ఏక గ్రీవం అంత సునాయశం కావడం లేదు బీజేపీ ప్రభుత్వానికి. ఎన్డీఏ ప్రభుత్వం విపక్షాలను ఎంతగా బుజ్జగించినా ఏకగ్రీవ ఆమోదం మాత్రం లభించడం లేదు. ఇప్పటిదాకా విపక్షాల కూటమితో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో సభాపతి స్థానానికి ఇండియా కూటమి పోటీపడుతోంబది. దీంతో స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఇప్పటికే ఎన్టీయే తరపున ఓం బిర్లా నామినేషన్ వేశారు. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కే.సురేశ్ బరిలో ఉన్నారు. వాస్తవానికి స్పీకర్ పదవిని అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది ఇప్పటిదాకా.

డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు

గత ఎన్టీయే హయాంలో డిప్యూటీ స్పీకర్‌ లేకుండానే సభలు నడిచాయి. అయితే, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో దిగువ సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ స్పీకర్ పదవికి పట్టుబట్టాయి. స్పీకర్‌ పదవి అధికార పక్షం తీసుకుంటే.. డిప్యూటీ స్థానాన్ని తమకు ఇవ్వాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే స్పీకర్ పదవికి తాము కూడా అభ్యర్థిని నిలబెడతామని హెచ్చరించాయి. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను బీజేపీ రంగంలోకి దించింది. మంగళవారం ఉదయం నుంచి ఆయన మల్లికార్జున్‌ ఖర్గే, ఎంకే స్టాలిన్‌ సహా పలువురు ఇండియా కూటమి నేతలతో వరుస చర్చలు జరిపారు. స్పీకర్‌ పదవి ఏకగ్రీవమయ్యే సంప్రదాయాన్ని కొనసాగిద్దామని, అందుకు సహకరించాలని కోరారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ..డిప్యూటీ స్పీకర్ పదవి కావాలన్న డిమాండ్‌ మళ్లీ ముందుంచాయి. కానీ, దీనికి ఎన్డీయే సర్కారు సమ్మతించలేదు. దీంతో ప్రతిపక్షాలు పోటీకి దిగాయి. నామినేషన్‌ గడువు ముగియడానికి కేవలం కొన్ని నిమిషాల ముందు ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించారు. ఫలితంగా స్పీకర్‌ పదవికి ఎన్నిక అనివార్యమైంది. తిరిగి బుధవారం (జూన్‌ 26) ఈ ఎన్నిక నిర్వహించనున్నారు.

స్వాతంత్య్రాని ముందు..

స్వాతంత్య్రానికి పూర్వం.. 1925 ఆగస్టు 24న అప్పటి ‘సెంట్రల్‌ లెజిస్లేటివ్‌ అసెంబ్లీ’కి ఎన్నికలు నిర్వహించారు. తర్వాత అదే పార్లమెంటుగా మారింది. ఆ ఎన్నికల్లో టి.రంగాచారియార్‌పై స్వరాజ్య పార్టీ అభ్యర్థి విఠల్‌భాయ్‌ జె.పటేల్‌ స్పీకర్‌గా నెగ్గారు. కేవలం రెండు ఓట్ల (58-56) తేడాతో విజయం సాధించారు. 1925 – 1946 మధ్య ఆరుసార్లు సభాపతి పదవికి ఎన్నికలు అవసరమయ్యాయి. చిట్టచివరిగా 1946లో ఎన్నికైన కాంగ్రెస్‌ నేత జి.వి.మౌలాంకర్‌.. ఆ తర్వాత తాత్కాలిక పార్లమెంటుకు కూడా స్పీకర్‌గా కొన్నాళ్లు కొనసాగారు.1952లో తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్‌సభ, రాజ్యసభలు ఏర్పాటయ్యాయి. 1956లో మౌలంకర్‌ మరణంతో ఉప సభాపతిగా ఉన్న అయ్యంగార్‌.. స్పీకర్‌ అయ్యారు. ఆ తర్వాత 1957లో రెండో సాధారణ ఎన్నికల తర్వాత కూడా స్పీకర్‌గా నియమితులయ్యారు. అలా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్‌సభ స్పీకర్‌ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్‌.ధిల్లాన్, బలరాం జాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు