lemon
జాతీయం

Lemon : వామ్మో.. ఒక్క నిమ్మకాయ ధర రూ.13వేలు.. ఎందుకంటే..

Lemon : ఒక్క నిమ్మకాయ  ధర ఎంతుంటుంది.. మహా అయితే ఓ పది రూపాయలు ఉంటుంది కావచ్చు. అంతకంటే ఎక్కువ ఉండదు. ఉన్నా ఎవరూ కొనరు. కానీ ఇప్పుడు చెప్పబోయే నిమ్మకాయకు మాత్రం ఏకంగా రూ.13వేలు పెట్టేశారు. వినడానికి కూడా కాస్త వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా ఆ నిమ్మకాయలో ఏముంటుంది. పిండితే రసం తప్ప ఇంకేం వస్తుంది అనుకుంటున్నారు కదా.. కానీ ఆ నిమ్మకాయకు అంత స్పెషాలిటీ ఉంది మరి.

తమిళనాడులోని (Tamil Nadu) ఈరోడ్ జిల్లాలోని విలక్కేతి గ్రామంలో ఉండే కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో ఇది జరిగింది. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే శివరాత్రి రోజు ఈ ఆలయంలో (temple) ఉంచే నిమ్మకాయను అత్యంత పవిత్రంగా భావిస్తారు. శివుని పూజలో వినియోగించే ఆ నిమ్మకాయకు ప్రత్యేక శక్తులు ఉంటాయని స్థానిక ప్రజలు నమ్ముతుంటారు. అందుకే ప్రతి ఏడాది లాగానే ఈ సారి కూడా ఆ నిమ్మకాయకు వేలం నిర్వహించగా.. చాలా మంది పోటీ పడ్డారు. చివరకు రూ.13వేలకు ఓ వ్యక్తి దక్కించుకున్నాడు.వీటితో పాటు వెండి ఉంగరం, వస్తువులను కూడా వేలం వేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!