Kishan reddy birth day (60)
జాతీయం

National:కిషన్ రెడ్డి గ్రాస్ రూట్ లీడర్: మోదీ

Kishan Reddy 60 birth day Modi wishes and gave blessings:
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం తన 60వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. సార్వత్రిక ఎన్నికలలో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి వరుసగా కేంద్ర మంత్రిగా రెండో సారి పదవిని చేపట్టారు. ఎన్టీయే ప్రభుత్వం కిషన్ రెడ్డి కి బొగ్గు మరియు గనుల శాఖను కేటాయించింది. కాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా స్పెషల్ విషెస్ తెలిపారు. ‘కిషన్ రెడ్డి గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.. కిషన్ రెడ్డి గ్రాస్ రూట్ లీడర్, అట్టడుగు స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా మంత్రిగా ఎదిగారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చేస్తున్న కృషి మనందరికి ఆదర్శప్రాయమైనది. ఆయన దీర్ఘాయుష్షుతో ఆరోగ్యంగా జీవించాలని ప్రార్థిస్తున్నాను.’ అని మోడీ ట్వీట్ చేశారు.

అంచెలంచెలుగా ఎదిగి..

కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జన్మించారు. టూల్ డిజైనింగ్‌లో డిప్లొమా. 1977లో జనతా పార్టీలో చేరారు. అంతకుముందు సంఘ్ కార్యకర్త. 1980లో రంగారెడ్డి జిల్లా బీజేపీ యువమోర్చా కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2001లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారిగా, 2004లో భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.బీజేపీలో కీలక నేతగా ఎదిగిన కిషన్ రెడ్డి తొలిసారి హిమాయత్ నగర్ శాసనసభ నుంచి పోటీ చేసి గెలుపొందారు. హైదరాబాద్ నగరంలో సీటు. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా 2009లో అంబర్ పేట నుంచి పోటీ చేశారు. 2009 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

కేంద్ర మంత్రిగా..

2014లో మరో అవకాశం వచ్చింది. 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మళ్లీ గెలుపొందారు. 2016 నుంచి 2018 వరకు అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 ఎన్నికల్లో అంబర్ పేట నుంచి పోటీ చేసిన కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అయితే రీసెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ నుంచి గెలిచారు.. ఇందులో గెలవడమే కాకుండా కేంద్రంలో రెండో సారి మంత్రి పదవి కూడా దక్కింది. ఇటీవలి వరకు, ఆయన కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా పనిచేశారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!