Mumbai Airport: కువైట్ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు వచ్చిన నేపథ్యంలో, ఆ విమానం మంగళవారం ఉదయం అత్యవసర ల్యాండింగ్‌గా ముంబై విమానాశ్రయంలో దిగింది. మొత్తం 228 మంది ప్రయాణికులు ఉన్న ఈ ఫ్లైట్‌కు బాంబు ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ కొనసాగుతోంది, ఇంకా వివరాలు వెలువడాల్సి ఉంది.
హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఒక ఇమెయిల్‌లో, విమానంలో రిమోట్ కంట్రోల్ తో పేల్చే విధంగా బాంబు పెట్టినట్లు స్పష్టమైన హెచ్చరిక రావడంతో, ఆ బెదిరింపును అధికారులు “క్రెడిబుల్ థ్రెట్”గా పరిగణించారు. వెంటనే ఫ్లైట్‌ను ముంబైకి మళ్లించి, అక్కడ ఐసోలేషన్ బేలో నిలిపి దర్యాప్తు చేపట్టారు.
సమాచారం ప్రకారం, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉదయం 8.10 గంటలకు దిగాల్సిన విమానానికి మధ్యలోనే మార్గము మార్చమని ఆదేశాలు ఇచ్చారు. ఆ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 7.45 గంటలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. పూర్తిస్థాయి తనిఖీలు చేసిన తరువాత ఏ అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదని పోలీసులు తెలిపారు. కేసుపై మరింత విచారణ కొనసాగుతోంది.
ఇదికాక, థానే జిల్లాలోని మీరారోడ్ ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్ స్కూల్‌కు కూడా సోమవారం ఉదయం బాంబు బెదిరింపు ఇమెయిల్ వచ్చింది. స్కూల్ ఆఫీసుకు ఉదయం 6.30 సమయంలో “పాఠశాలలో బాంబు పెట్టాం” అని వచ్చిన మెసేజ్‌తో అలజడి నెలకొంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాంబు స్క్వాడ్‌తో పరిశీలించగా, అది హోక్స్ (తప్పుడు బెదిరింపు) అని తేలింది. అయితే జాగ్రత్త చర్యగా పోలీసులు అక్కడ మోహరించగా, స్కూల్ క్లాసులు సాధారణంగా కొనసాగించడానికి అనుమతి ఇచ్చారు.

