Railyway-Jobs
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Jobs In Railways: రైల్వేలో 2,865 ఉద్యోగాలు… శనివారం నుంచి మొదలైన దరఖాస్తులు

Jobs In Railways: రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC), వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) మొత్తం 2,865 అప్రెంటీస్ ఉద్యోగాలకు దరఖాస్తులు (Jobs In Railways) ప్రారంభించాయి. శనివారం (2025 ఆగస్టు 30) నుంచి అప్లికేషన్లు మొదలయ్యాయి. ఉద్యోగ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ wcr.indianrailways.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 2,865 ఖాళీలు ఉండగా, అందులో 1,150 అన్‌రిజర్వ్డ్ కేటగిరి ఉద్యోగాలు ఉన్నాయి. షెడ్యూల్డ్ కులాలకు (SC) 433 ఉద్యోగాలు, ఎస్టీలకు 215 ఖాళీలు, ఇతర వెనుకబడిన తరగతులకు 778 ఖాళీలు, ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు (EWS) 289 పోస్టులు, దివ్యాంగులకు 105, ఆర్మీ మాజీ ఉద్యోగులకు 85 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. ఈ ఖాళీలు జేబీపీ డివిజన్, బీపీఎల్ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్ బీపీఎల్, ఇతర డివిజన్లలో ఉన్నాయి.

అర్హతలు ఏమిటి?
ఈ ఖాళీలకు సంబంధించిన అర్హతల విషయానికి వస్తే, అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అభ్యర్థులకు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ నుంచి నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) జారీ అయ్యి ఉండాలి. వయోపరిమితి సడలింపు విషయానికి వస్తే, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. ఇతర బ్యాక్‌వర్డ్ క్లాసెస్ (OBC) అభ్యర్థులకు మూడే సడలింపు ఉంటుంది.

Read Also- Terrorist Killed: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిని ఖతం చేసిన భద్రతా బలగాలు.. ‘హ్యుమన్ జీపీఎస్’గా పిలిచే ఆ టెర్రరిస్ట్ గురించి తెలిస్తే..

ఇక ఎంపిక ప్రక్రియ విషయానికి వస్తే, అప్రెంటీస్ పోస్టులకు అభ్యర్థుల మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. 10వ తరగతి లేదా దాని సమాన చదువు, ఐటీఐ/ట్రేడ్ పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా మార్కులు వస్తే, వయస్సులో పెద్దవారికి పోస్టును కేటాయిస్తారు. మెరిట్ లిస్ట్‌ను డివిజన్ ఆధారంగా సిద్ధం చేస్తారు.

Read Also- Modi China Visit: ఏడేళ్ల తర్వాత తొలిసారి చైనాలో అడుగుపెట్టిన మోదీ.. అదిరిపోయేలా స్వాగతం

అప్లికేషన్ ఫీజు ఎంత?
దరఖాస్తు కోసం అభ్యర్థులు రూ.141 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు మాత్రం కేవలం రూ.41 చెల్లిస్తే సరిపోతుంది. ఇక, ధ్రువీకరణ పత్రాల విషయానికి వస్తే, అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ/ట్రేడ్ సర్టిఫికెట్లు, ఫొటో, సంతకం వంటి డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అధికారిక వెబ్‌సైట్ డబ్ల్యూసీఆర్.ఇండియన్‌రైల్వేస్.గవ్.ఇన్ (wcr.indianrailways.gov.in) పోర్టల్ ఓపెన్ చేసి, అబౌట్ అస్ సెక్షన్‌లో ‘రిక్రూట్‌మెంట్’పై క్లిక్ చేయాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, ఎంగేజ్‌మెంట్ ఆఫ్ యాక్ట్ అప్రెంటీస్‌పై క్లిక్ చేయాలి. లింక్‌పై క్లిక్ చేశాక, ‘న్యూ రిజిస్ట్రేషన్’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత వివరాలను నింపాల్సి ఉంటుంది.

Read Also- Rahul Dravid: రాహుల్ ద్రవిడ్ అనూహ్య నిర్ణయం.. దీనికి కారణం ఏమిటి?

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం