india secret operation targetted killings of pakistan terrorist india condemns the guardian article RAW: పాక్ టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే..! భారత్‌ వ్యతిరేక ఆలోచన పుడితే చాలు.. !!
indian national flag, tricolor
జాతీయం

RAW: పాక్ టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే..! భారత్‌ వ్యతిరేక ఆలోచన పుడితే చాలు.. !!

Pakistan: పాకిస్తాన్‌ కేంద్రంగా మన దేశంలో ఎన్నో ఉగ్ర ఘటనలు జరిగాయి. ఆ తర్వాత ప్రతిగా మన నుంచి హెచ్చరికలు.. అప్పుడప్పుడు ‘ఉరి సర్జికల్ స్ట్రైక్’ వంటివి జరిగాయి. ఇదంతా దాడి జరిగిన తర్వాత కౌంటర్ ఎటాక్ వంటివి. కానీ, అసలు దాడే జరగకుండా ముందుగా పసిగట్టి ఆ ఉగ్రమూకలను కట్టడి చేస్తే ఎలా ఉంటుంది? ఇదంతా బాలీవుడ్ సినిమా టైప్ స్టోరీలా ఉన్నది కదూ. డీ-డే, ఫాంటమ్ వంటి బాలీవుడ్ సినిమాలు ఇలాగే.. ఆ దేశంలోకి వెళ్లి ఉగ్రవాదులు, ఉన్మాదులను మట్టుబెట్టే ఇతివృత్తంతో ఉంటాయి. మన దేశ నిఘా అధికారులు కూడా ఈ కోణంలో ఆలోచించారని, అందుకు తగ్గట్టుగా ఆపరేషన్లు కూడా చేపట్టారని ది గార్డియన్ అనే ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రచురించింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది వేరే విషయం.

ఇటీవలి కాలంలో భారత్ వ్యతిరేక కుట్రలు చేస్తున్నవారు.. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులైనా.. కెనడాలోని ఖలిస్తానీ అయినా ఉన్నట్టుండి హత్యకు గురయ్యారు. ఎవరు చంపింది? ఎందుకు చంపింది? ఏమీ తెలియదు. హఠాత్తుగా వారు హతమయ్యారు. ఈ వరుస హత్యల వెనుక భారత్ ప్రమేయం ఉన్నదా? అనే అనుమానాలు చర్చకు వచ్చాయి. కెనడా, అమెరికా వంటి దేశాలు ఆరోపణలూ చేశాయి. 2020 నుంచి 2023 వరకు సుమారు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారని, ఈ హత్యలు రా పర్యవేక్షణలో జరిగాయని ది గార్డియన్ పత్రిక ఆరోపించింది.

Also Read: మళ్లీ సీబీఐ వంతు..! తిహార్ జైలులో కవితను ప్రశ్నించనున్న సీబీఐ

పుల్వామా ఘటన తర్వాత రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా) తన స్ట్రాటజీ మార్చిందని, భారత వ్యతిరేక శక్తులు ఇక్కడ దాడి చేయడానికి ముందే గుర్తించి నిర్మూలించే కొత్త పంథాను రా ఎంచుకుందని రా అధికారి ఒకరు ది గార్జియన్‌కు చెప్పినట్టు రాసింది. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్, రష్యా గూఢచార సంస్థ కేజీబీలను ప్రేరణగా తీసుకున్నట్టూ వివరించారని పేర్కొంది. అయితే.. ఈ ఆపరేషన్లకు ప్రభుత్వంలో అత్యున్నతస్థాయి ఆమోదం తప్పనిసరి అని చెప్పినట్టు రాసింది. కెనడా, అమెరికాల ఆరోపణలు రావడంతో ఇలాంటి టార్గెట్ కిల్లింగ్స్ ఆపేయాలని ఆదేశాలు వచ్చాయని ప్రచురించింది.

ఈ ఆరోపణలను భారత్ ఖండించింది. ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారతదేశ వ్యతిరేక దుష్ప్రచారం అని కేంద్ర విదేశాంగ శాఖ ఖండించినట్టూ అదే పత్రిక తన కథనంలో పేర్కొంది. ఈ హత్యల్లో భారత్ ప్రమేయం లేకున్నా.. తీవ్రవాద శక్తులు అంతరించడం అందరికీ మంచిదే. భారత వ్యతిరేక ఆలోచనలకు ఈ పరిణామాలు అడ్డుకట్ట వేసేలా ఉన్నాయనడంలో మాత్రం సందేహం లేదు.

Just In

01

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

TG Christmas Celebrations: క్రిస్మస్ వేడుకలకు సర్కారు నిధులు.. నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

Akhanda2: బాలయ్య ‘అఖండ 2’ మూడో రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే?.. ఇది మామూలుగా లేదుగా..

Sircilla Panchayat Elections: రెండో దశ ఎన్నికల్లో సిరిసిల్ల నియోజకవర్గంలో గులాబీ ముందంజ.. దరిదాపుల్లో కూడా లేని బీజేపీ!

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!