Heavy Rain In Delhi
జాతీయం

Heavy Rain In Delhi : వరద ముంపులో హస్తిన

– 24 గంటల పాటు బాదేసిన వాన
– నీటమునిగిన కాలనీలు, స్తంభించిన విద్యుత్
– కుప్పకూలిన విమానాశ్రయ టెర్మినల్
– విమాన సేవలకు అంతరాయం, పలు సర్వీసుల రద్దు
– రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం

Heavy Rain In Delhi : దేశ రాజధాని ఢిల్లీ నగరం వరుణుడి ధాటికి అల్లాడిపోయింది. ఆగకుండా 24 గంటల పాటు కురిసిన జడివాన ధాటికి దేశ రాజధాని ఒక్కసారిగా స్తంభించిపోయింది. కుండపోతగా కురిసిన వాన కారణంగా వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో వేలాది వాహనాలు నీటమునిగాయి. కరెంటు, తాగునీరు లేక నగరవాసులు అల్లాడిపోయారు. ఎక్కడికక్కడ కూలిన చెట్లు, కరెంటు స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్ల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఢిల్లీ విమానాశ్రయం మొదటి టెర్మినల్ భారీ వర్షాలకు కుప్పకూలటంతో విమాన సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. యావత్ ఢిల్లీ అధికార యంత్రాంగం అంతా రంగంలోకి దిగి పరిస్థితిని సరిదిద్దేందుకు అహర్నిశలు పనిచేస్తున్నారు.

కుండపోత వానతో కుదేలు

2024, జూన్ 25వ తేదీ అర్థరాత్రి మొదలైన వర్షం నగరాన్ని కుదేలు చేసింది. కేవలం మూడు గంటల్లో 15 సెం.మీ వర్షం నమోదు కాగా, 24 గంటలు గడిచేసరికి మొత్తం 24 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. వాననీరు పోయే డ్రైనేజీలు ఎక్కడికక్కడ రోడ్లన్నీ జామ్ అయ్యాయి. భారీ వర్షాలపై ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షించారు. నగర పాలక సంస్థలోని ఉద్యోగులు అందరికీ సెలవులు రద్దు చేసి.. విధుల్లో చేరాలని ఆదేశించారు. 1936లో ఒకే రోజు ఇంత వర్షం కురిసిందనీ, అప్పట్లో ఇంతగా కాంక్రీట్ నిర్మాణాలు లేనందున వాననీరు దిగువకు పోయిందనీ, కానీ, నేడు ఆ పరిస్థితి లేనందున వాననీరు ఎక్కడికక్కడ నిలిచి కాలనీలకు కాలనీలు మునిగిపోయాయని అధికారులు పేర్కొన్నారు.

కుప్పకూలిన టెర్మినల్

ఢిల్లీలో వరుసగా రెండో రోజు వర్షం సృష్టించిన బీభత్సం ధాటికి తెల్లవారుజామున విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన అక్కడి యంత్రాంగం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించింది. పైకప్పు కూలిన ఘటనలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ టెర్మినల్ నుంచి వెళ్లే పలు విమాన సర్వీసులు రద్దు చేశారు. ముందుజాగ్రత్తగా విమానాశ్రయ వర్గాలు చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు. ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ రాయుడు పరిశీలించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, టెర్మినల్ 2, టెర్మినల్ 3 ఎప్పటిలాగే పూర్తి స్థాయిలో పని చేస్తాయని వెల్లడించారు మృతుని కుటుంబానికి రూ.20 లక్షలు, క్షతగాత్రులకు రూ. 3 లక్షల సాయం అందించామని ఆయన వెల్లడించారు.

Just In

01

Pookalam Controversy: పూలరంగవల్లిలో ఆపరేషన్ సిందూర్‌పై వివాదం.. 27 మందిపై కేసు

Mahabubabad District: నేడు సెలవు అయినా.. ఆగని యూరియా పంపిణీ.. ఎక్కడంటే..?

Chikoti Praveen: హైదరాబాద్ మరో పంజాబ్‌గా మారే ప్రమాదం.. చికోటి ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు

Samantha: వామ్మో.. 500 మంది మగాళ్ల ముందు హాట్ సీన్ లో రెచ్చిపోయిన సమంత..?

Cheruku Sudhakar: తెలంగాణ ఉద్యమంలో యువతకు ఆయనే ఆదర్శం.. మాజీ ఎమ్మెల్యే కీలక వాక్యలు