Mallikarjun Kharge: బిహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపు ఖాయమని అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీఏ ఆధిక్యం కనబరుస్తుందని చెబుతున్నాయని, కానీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు ఎంత తప్పయ్యాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తాయని అంచనా వేశాయని, కానీ బీజేపీ గెలిచిందని గుర్తు చేశారు. ఎగ్జిట్ పోల్స్ కాదని, రేపు వెలువడే ఫలితాలను చూడాలని ఖర్గే చెప్పారు.
Also Read: Mallikarjun Kharge: ఆపరేషన్ సింధూర్ పై.. జాతీయ కాంగ్రెస్ రియాక్షన్ ఇదే!
501 కిలోల లడ్డూల ఆర్డర్
ఎగ్జిట్ పోల్స్ అంచనాల నేపథ్యంలో బీజేపీలో జోష్ కనిపిస్తున్నది. పాట్నాలో 501 కిలోల లడ్డూలను కాషాయ పార్ట ఆర్డర్ ఇచ్చినట్టు సమాచారం. ఫలితాల రోజు తామంతా దీపావళి, హోలీ, ఈద్ పండుగులు జరుపుకుంటామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీగా లడ్డూలను ఆర్డర్ ఇచ్చినట్టు తెలిసింది. 243 అసెంబ్లీ స్థానాలు ఉన్న బిహార్‌లో మ్యాజిక్ ఫిగర్‌కు 122 సీట్లు కావాలి.
