Driving Licence: కేంద్ర రోడ్డు రవాణా హైవేస్ శాఖ వాహన యజమానులు డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లకు వాహన్ (Vahan), సారథి (Sarathi) పోర్టళ్లలో వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ను అప్‌డేట్ చేయాలని సూచించింది. దీని వలన రికార్డులను సరిగ్గా నిర్వహించడం, OTP ఆధారిత వెరిఫికేషన్, రవాణా సంబంధిత సేవలకు నిరవధిక యాక్సెస్ కల్పించడం లక్ష్యం.
మొబైల్ నంబర్ అప్డేట్ ఎందుకు చేయాలంటే?
మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ OTP వెరిఫికేషన్, స్టేటస్ అలర్ట్స్, డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్ సేవల గురించి నోటిఫికేషన్లు వస్తాయి. పాత నంబర్ ఉంటే లాగిన్ విఫలమవ్వడం, అప్డేట్ లు మిస్ కావడం లేదా ఆన్‌లైన్ సేవల్లో ఆలస్యం కావొచ్చు. ఈ వివరాలను డేటాబేస్‌లో ఎంటర్ చేయడం వలన రికార్డులు సురక్షితంగా ఉంటాయి.
వాహన్‌లో మొబైల్ నంబర్ అప్డేట్ విధానం
1. అధికారిక వాహన్ మొబైల్ అప్‌డేట్ పేజీను బ్రౌజర్‌లో ఓపెన్ చేయండి.
2. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అప్‌డేట్ ఆప్షన్ ఎంచుకోండి.
3. మీ వాహన రిజిస్ట్రేషన్ నంబర్ మరియు కావాల్సిన ఇతర వివరాలు నమోదు చేయండి.
4. కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయండి.
5. కొత్త నంబర్‌కు వచ్చిన OTPను వెరిఫై చేయండి.
6. రిక్వెస్ట్ సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ మెసేజ్ లేదా అక్నాలెడ్జ్ మెంట్ గమనించండి.
7. సక్సెస్‌గా సబ్మిట్ అయిన తర్వాత, వాహన్ డేటాబేస్‌లో కొత్త నంబర్ ప్రతిబింబించబడుతుంది.
డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్ల కోసం సారథిలో అప్‌డేట్ విధానం
1. డెస్క్‌టాప్ లేదా మొబైల్ బ్రౌజర్ ద్వారా సారథి పోర్టల్ కి వెళ్ళండి.
2. డ్రైవింగ్ లైసెన్స్ వివరాల అప్‌డేట్ సేవను ఎంచుకోండి.
3. మీ డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, జననం తేదీ మరియు ఇతర అవసరమైన వివరాలు నమోదు చేయండి.
4. కొత్త మొబైల్ నంబర్ నమోదు చేయండి.
5. OTP తో నంబర్‌ను వెరిఫై చేయండి.
6. రిక్వెస్ట్ సబ్మిట్ చేసి, కన్ఫర్మేషన్ కాపీని భద్రపరచండి.
అప్‌డేట్ ప్రారంభించడానికి ముందుగా సిద్ధం చేసుకోవాల్సినవి
వాహన రిజిస్ట్రేషన్ నంబర్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, జననం తేదీ, కొత్త మొబైల్ నంబర్ యాక్సెస్ ఇలా అన్ని వివరాలను నమోదు చేయడం వలన సబ్మిషన్ విఫలమవ్వ కుండా, ఆన్‌లైన్ సేవలను ఉపయోగించుకోవచ్చు.

