IIT BABA
జాతీయం

IIT BABA : ఐఐటీ బాబాపై గంజాయి కేసు నమోదు.. అరెస్ట్ చేసిన పోలీసులు

IIT BABA : ఐఐటీ బాబా..ఈ పేరు కుంభమేళా (Kumbh Mela) టైమ్ లో ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. సోషల్ మీడియా మొత్తం ఐఐటీ బాబా అభయ్ సింగ్ (Abhay Singh) పేరుతో తెగ ఊగిపోయింది. బాగా చదువుకున్నోడు కూడా బాబా అయ్యాడు.. అతను జీవితాన్ని తెలుసుకున్నాడు.. అదే ఉత్తమమైన జీవితం..అందరూ అతనిలాగే బతకాలి.. అబ్బో ఇలా ఒకటా రెండా మనోడికి పెద్ద బిల్డప్ ఇచ్చేశారు. కానీ తీరా చూస్తే మనోడి అసలు బాగోతం బయటపడింది. ఏకంగా గంజాయి తాగుతున్నాడు ఈ మహానుభావుడు. కుంభమేలా టైమ్ లో బాగా ఫేమస్ అయిన మనోడికి సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ పెరిగింది.ఇంకేముంది అన్నీ నాకే తెలుసు అన్నట్టు పెద్ద స్టేట్ మెంట్లు కూడా ఇచ్చాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ చేతిలో ఇండియా ఓడిపోతుంది అని నా మాటే శాసనం అన్నట్టు స్టేట్ మెంట్ ఇచ్చాడు. తీరా చూస్తే మనోళ్లు పాకిస్థాన్ ను ఉతికి ఆరేసి చిత్తు చిత్తుగా ఓడించి ఇంటికి పంపారు. అసలే క్రికెట్ కు భక్తులున్న దేశం మనది. అది కూడా దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడిపోతుందని తప్పు చెప్తావా అంటూ క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఈ ఐఐటీ బాబాను సోషల్ మీడియాలో ఉతికి ఆరేశారు. దారుణంగా ట్రోల్ చేసి పడేశారు. ఈ టైమ్ లోనే నేను చచ్చిపోతానంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నాడు ఈ ఐఐటీ బాబా. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రిద్ధి సిద్ధి పార్క్ క్లాసికల్ హోటల్ దగ్గరకు వచ్చి మనోడిని అరెస్ట్ చేశారు. ట్విస్ట్ ఏంటంటే ఈ ఐఐటీ బాబా దగ్గర భారీగా గంజాయి దొరికింది. అతను గంజాయి తాగుతున్నట్టు పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.

 

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ