Foot Ball | కేరళలో దారుణం చోటు చేసుకుంది. ఆనందంగా ఫుట్ బాల్ మ్యాచ్ చూద్దామని వచ్చిన వాళ్లకు తీవ్ర శోకం మిగిలింది. కేరళ (kerala) రాష్ట్రంలోని మల్లపురం జిల్లా అరకొడెలో మంగళవారం రాత్రి ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించారు. స్థానికంగా ఉన్న స్టేడియం ఫుట్ బాల్ ఆటలకు చాలా ఫేమస్.
అయితే నిన్న రాత్రి మ్యాచ్ జరగక ముందే సడెన్ గా బాణాసంచా పేలుడు సంభవించింది. ప్రేక్షకులు కూర్చున్న గ్యాలరీలో పేలుడు జరిగేసరికి.. 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.