Rapido Driver - ED: ర్యాపిడో డ్రైవర్ ఖాతాకు రూ.331 కోట్లు!
Rapido Driver - ED (Image Source:Twitter)
జాతీయం

Rapido Driver – ED: ర్యాపిడో డ్రైవర్ ఖాతాకు రూ.331 కోట్లు.. రిసార్టులో విలాసవంతమైన వివాహం.. తీరా తెలిసిందేమంటే?

Rapido Driver – ED: ర్యాపిడో డ్రైవర్ల రోజూవారి జీవన విధానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఉదయం నుంచి రాత్రి వరకూ వరుస పెట్టి రైడ్లు చేసినా రోజుకు రూ.1000 నుంచి రూ.1500 రావడం గగనం. అలాంటిది ఓ డ్రైవర్ ఖాతాలోకి ఏకంగా రూ.331 కోట్లు జమ కావడం చూసి ఈడీ అధికారులు సైతం అవాక్కయ్యారు. ఇదేదో తేడాగా ఉందని దర్యాప్తు ప్రారంభించగా ఉదయ్ పూర్ లో గ్రాండ్ గా జరిగిన వివాహానికి ఆ డబ్బును ఖర్చు చేసినట్లు తేలింది. ఇంతకీ ఆ డ్రైవర్ ఎవరు? ర్యాపిడో డ్రైవర్ కు ఆ పెళ్లికి లింకేంటి? ఇంతకీ ఆ డబ్బు డ్రైవర్ ఖాతాలోకి ఎలా వచ్చింది? ఇప్పుడు చూద్దాం.

అసలేం జరిగిందంటే?

రాజస్థాన్ ఉదయ్ పూర్ లో తాజ్ ఆరావళి రిసార్ట్ లో అత్యంత విలాసవంతంగా జరిగిన పెళ్లి కోసం ఓ ర్యాపిడో డ్రైవర్ ఖాతా నుంచి నగదు చెల్లించినట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గుర్తించారు. గుజరాత్ యువ రాజకీయ నాయకుడు ఆదిత్య జులా (Aditya Zula) కుటుంబంతో సంబంధం ఉన్న ఈ వివాహం గతేడాది నవంబర్ లో జరిగింది. అయితే ఈ వేడుకకు వినియోగించిన నగదు మూలాలు.. ప్రస్తుతం అనుమానాలకు తావిస్తోంది.

పెళ్లికి ఎంత ఖర్చు చేశారంటే?

1xBet అక్రమ బెట్టింగ్ రాకెట్‌పై దర్యాప్తు చేస్తున్న క్రమంలో సదరు రాపిడో డ్రైవర్‌ ఖాతాలో రూ.331.36 కోట్లు జమ అయినట్లు ఈడీ గుర్తించింది. 2024 ఆగస్టు నుంచి 2025 ఏప్రిల్ మధ్య విడతల వారీగా ఈ నగదు వచ్చి చేరినట్లు కనుగొన్నారు. అయితే ఆ డబ్బు నుంచి రూ. కోటి కంటే ఎక్కువ నగదును ఉదయ్ పూర్ లో జరిగిన వివాహానికి మళ్లించడం ఆసక్తికరంగా మారింది. దీనిపై మరింత క్షుణ్ణంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేయగా.. వధూ వరులతో డ్రైవర్ కు ఎలాంటి పరిచయం లేదని తేలింది.

మ్యూల్ అకౌంట్..

అయితే నేరస్థులు ర్యాపిడో డ్రైవర్  బ్యాంక్ ఖాతాను ‘మ్యూల్ అకౌంట్’గా వినియోగించినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నిందితులు తమ వివరాలు బయటపడకుండా ఇలా అమాయక వ్యక్తుల పేర్ల మీద బ్యాంకు ఖాతాను తెరిచి దాని నుంచి నగదు లావా దేవీలు చేయడాన్ని ‘మ్యూల్ అకౌంట్’ గా చెబుతుంటారు. అయితే ర్యాపిడో డ్రైవర్ ఖాతాకు నగదు వచ్చిన వెంటనే.. అది మరో ఖాతాలోకి వెళ్లిపోతుండటం కూడా ఈడీ దర్యాప్తులో బయటపడింది.

Also Read: Election Symbols: సర్పంచ్ ఎన్నికల గుర్తులు ప్రకటించిన ఎన్నికల సంఘం.. మొత్తం 30 గుర్తులు..?

ఈడీ అధికారి ఏమన్నారంటే?

ఆర్థిక లావాదేవీల కోసం నేరస్థులు ఇలా మ్యూల్ అకౌంట్ వినియోగించే ధోరణిని ఇటీవల కాలంలో బాగా పెరిగిపోయిందని సీనియర్ ఈడీ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఇలా ఆటో డ్రైవర్ పేరుతో రూ.331 కోట్ల మేర లావాదేవీలు జరపడం మాత్రం తమకు కూడా ఆశ్చర్యం కలిగించినట్లు చెప్పారు. ఈ కేసు ద్వారా విలాసవంతమైన వేడుకలకు నిధులు సమకూర్చడం కోసం మ్యూల్‌ ఖాతాలను ఎలా వినియోగిస్తున్నారో స్పష్టమవుతోందని అన్నారు. తమకు తెలియకుండానే చాలా మంది అమాయకులు నేరపూరిత ఆర్థిక లావాదేవీల్లో భాగస్వాములు అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోందని.. త్వరలో అసలు నేరస్థులను పట్టుకుంటామని సదరు అధికారి వివరించారు.

Also Read: CM Revanth Reddy: రేపు విజన్ డాక్యుమెంట్‌పై సీఎం రేవంత్ కీలక సమీక్ష.. ముఖ్య అంశాలివే..!

Just In

01

Boora Narsaiah Goud: ఢిల్లీలో మాకో చిత్రగుప్తుడు ఉన్నాడు.. మాజీ ఎంపీ ఆసక్తికర వ్యాఖ్యలు

Rajiv Swagruha Plots: రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలానికి దరఖాస్తుల ఆహ్వానం… అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలంటే

VK Naresh: ఫస్ట్ టైమ్.. నా సినిమాకు నాకే టికెట్స్ దొరకలేదు

Bhatti Vikramarka: రాబందులను దరిదాపుల్లోకి రానివ్వం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Bigg Boss 9 Tamil Winner: ‘బిగ్ బాస్ తమిళ్ సీజన్ 9’ విన్నర్.. మన తెలుగు వాళ్లకీ పరిచయమే!