IndiGo Flight: ఇండిగో సంస్ధ సీఈవోకు షోకాజ్ నోటీసులు
IndiGo Flight (imagecredit:twitter)
Telangana News, జాతీయం

IndiGo Flight: ఇండిగో సంస్ధ సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు

IndiGo Flight: దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో(Indigo)లో ఇటీవల ఐదు రోజులుగా జరిగిన భారీ విమాన రద్దులు, ఆలస్యంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తీవ్ర చర్యలు తీసుకుంది. సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్‌కు, అకౌంటబుల్ మేనేజర్‌కు శనివారం నాడు డీజీసీఏ షోకాజ్ నోటీసు జారీ చేసింది. 24 గంటల్లో దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విమాన కార్యకలాపాలు ఇంత భారీ స్థాయిలో ఆగిపోవడానికి ప్రధాన కారణం, కొత్తగా అమలులోకి వచ్చిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలకు (పైలట్ల డ్యూటీ, విశ్రాంతి సమయాలకు సంబంధించిన నిబంధనలు) అనుగుణంగా సంస్థ సమర్థవంతమైన ఏర్పాట్లు చేసుకోకపోవడమేనని డీజీసీఏ నోటీసులో స్పష్టం చేసింది. ఒకే రోజులో వెయ్యికి పైగా విమానాలు రద్దు కావడం భారత విమానయాన చరిత్రలో రికార్డు అని డీజీసీఏ పేర్కొంది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో సంస్థ తీవ్ర లోపాలు చూపించిందని, ఇది నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.

సౌకర్యాలు కల్పించడంలో వైఫల్యం

సీఈవోగా విమానయాన సంస్థ సమర్థవంతమైన నిర్వహణను నిర్ధారించే బాధ్యత పీటర్ ఎల్బర్స్‌(Peter Elbers)కు ఉందని, కానీ ఆయన తమ విధుల్లో విఫలమయ్యారని డీజీసీఏ(DGCA) విమర్శించింది. విమానాల రద్దు, దీర్ఘకాలిక ఆలస్యాల సమయంలో ప్రయాణీకులకు తప్పనిసరిగా అందించాల్సిన సమాచారం, వసతి, భోజనం, ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు వంటి సౌకర్యాలను కల్పించడంలో కూడా ఇండిగో విఫలమైందని డీజీసీఏ పేర్కొంది. దీనిపై సంతృప్తికరమైన వివరణ ఇవ్వకపోతే, ఇండిగోపై కఠినమైన నియంత్రణ చర్యలు, భారీ జరిమానాలు విధించే అవకాశం ఉంది.

Also Read: IndiGo crisis: ఇండిగో ఎఫెక్ట్.. కొండెక్కిన విమాన టికెట్ ధరలు.. కేంద్రం కఠిన ఆదేశాలు

ఇండిగోకు డెడ్‌లైన్

దేశంలో ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సేవలకు ఏర్పడిన తీవ్ర అంతరాయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు(Minister Rammohan Naidu) దృష్టి సారించారు. ఈ విషయమై ఆయన ఇండిగో సంస్థ సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌, ఇతర సీనియర్‌ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తాజా పరిస్థితులను, సంస్థ తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రి ఈ సమావేశంలో సమీక్షించారు. విమాన కార్యకలాపాలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి పునరుద్ధరించడం తక్షణ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి సంస్థకు స్పష్టం చేశారు. ముఖ్యంగా, రద్దయిన విమానాల టికెట్ల డబ్బును ప్రయాణీకులకు వెంటనే తిరిగి చెల్లించేలా చూడాలని సంస్థ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత సంక్షోభానికి దారితీసిన కారణాలను లోతుగా పరిశీలించి, ఉపశమన చర్యలను సూచించేందుకు ఇప్పటికే డీజీసీఏ నలుగురు సభ్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Sarpanch Elections: సర్పంచ్ ఎన్నికల్లో మరో వింత.. కోతులను పడుతున్న అభ్యర్థి.. 300 వరకూ పట్టివేత

Just In

01

Dharma Mahesh: మరో స్టేట్‌లోనూ మొదలెట్టిన ధర్మ మహేష్..

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు