Congress and BRS parties are coming together
జాతీయం

PM Modi : కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు దొందూ దొందే!

Congress, BRS Parties Are Coming Together : ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. పార్టీలన్నీ ప్రచారంలో జోరు పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే, ప్రధాని మోడీ మరోమారు తెలంగాణ పర్యటనకు వచ్చారు. జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఎక్కువ సీట్లు వస్తే అంత శక్తి తనకు వస్తుందని తెలిపారు. ‘‘తెలంగాణలో 2 కోట్ల మందికి ఉచిత రేషన్ అందించాం. పసుపు ధర పెంచేలా చేశాం. రజాకార్లకు వ్యతిరేకంగా ఈ గడ్డ పోరాడింది’’ అని గుర్తు చేశారు.

రాష్ట్ర అభివృద్ధికి గ్యారెంటీ ఇస్తున్నట్టు చెప్పారు. అవినీతికి పాల్పడిన ఎవరినీ వదిలి పెట్టబోమని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే నిర్ణయాలే తాము తీసుకుంటామని, ప్రతిపక్షాలు మహిళా శక్తి పేరిట చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ, ప్రతి మహిళలో, బాలికలో తాను శక్తిని దర్శిస్తానని అన్నారు. దేశంలో భారతమాత శక్తిని చూస్తానని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ప్రతీ ప్రాంతానికీ అభివృద్ధి చేరుతోందని తెలిపారు. ఇక, బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు ప్రధాని. “శివాజీ పార్కులో రాహుల్ గాంధీ నా పోరాటం శక్తికి వ్యతిరేకంగా అన్నారు. నాకు ప్రతి మహిళా ఓ శక్తి స్వరూపంలా కనిపిస్తుంది. నేను భారత మాతకు పూజారిని. శక్తిని వినాసనం చేస్తారని ఎవరైనా అంటారా? శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ 4వ తేదీన తెలుస్తుంది. చంద్రయాన్ విజయవంతమైన ప్రాంతానికి కూడా శివశక్తి అని పేరు పెట్టుకున్నాం.

Read More: గవర్నర్ పదవికి తమిళిసై రాజీనామా, రాష్ట్రపతికి లేఖ

2జీ స్పెక్ట్రమ్ కేసులో డీఎంకే పేరు బయటకు వచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లిస్ట్ లో బీఆర్ఎస్ వచ్చి చేరింది. తెలంగాణ నుంచి కుటుంబ పార్టీలు ఢిల్లీలో డబ్బులు పెట్టాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పై విచారణ ప్రారంభిస్తే మోడీని తిట్టడం ప్రారంభిస్తారు. తెలంగాణను దోచుకునే వారిని వదిలిపెట్టం. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ తెలంగాణను దోచుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు బీఆర్ఎస్‌పై ఉన్న ఆగ్రహం బయటపడింది. తెలంగాణను బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి చేసింది. లిక్కర్ స్కామ్‌లో కూడా కమిషన్లు తీసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరికి ఒకరు సహకరించుకుంటున్నారు.

అలాంటి నాయకుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వికసిత్ తెలంగాణ నుంచి వికసిత్ భారత్ నా లక్ష్యం. తెలంగాణలో కేంద్రం వేల కోట్ల అభివృద్ధి పనులను చేపట్టింది” అని మోడీ అన్నారు. తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్ కు ఓటు వేయనున్నారని ప్రధాని అన్నారు. ‘తెలంగాణ ప్రజలు వికసిత్ భారత్‌కు ఓటు వేయనున్నారు. మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్రను సృష్టించబోతున్నారు. తెలంగాణ బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజ్‌ గిరి రోడ్ షోలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు’ అని అన్నారు పీఎం మోడీ.

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?