Chhattisgarh Bus Ferrying Workers Falls Into Soil Mine Pit In Durg 15 Killed
జాతీయం

Bus Accident: లోయలో పడ్డ బస్సు, మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్‌

Chhattisgarh Bus Ferrying Workers Falls Into Soil Mine Pit In Durg 15 Killed: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. దుర్గ్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది అక్కడికక్కడే మరణించారు. కూలీలతో వెళ్తున్న బస్సు సాయంత్రం లాల్ మురోమ్ గనిలో పడిపోయిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు గనిలో పడిపోవడంతో ఇప్పటివరకు 14 మంది మృతి చెందగా, మిగిలిన 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందించారు.

ఇక అసలు వివరాల్లోకి వెళితే.. కుమ్హారి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాప్రి గ్రామంలో మురం గని ఉంది. కుమ్హారి ప్రాంతంలో నిర్మించిన కేడియా డిస్టిలరీస్‌కు చెందిన బస్సు ఇది ఈ పరిశ్రమలోని కార్మికులను రోజూ తీసుకువెళ్తోంది. ఈ బస్సులో 30 మంది పరిశ్రమకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఈ బస్సు ఖాప్రి గ్రామం సమీపంలో వెళుతుండగా బస్సు అదుపు తప్పి 40 అడుగుల గనిలో పడిపోయింది. బస్సు గనిలో పడిపోవడం గమనించిన స్థానికులు వెంటనే ప్రమాద స్థలం దగ్గరకు పరుగులు తీశారు.ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 40 అడుగుల కింద పడిపోయిన బస్సులోంచి ప్రజలను ఎలాగోలా బయటకు తీశారు. అనేక అంబులెన్స్‌లు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఒక్కొక్కరుగా బస్సు లోపల నుంచి క్షతగాత్రులను, మృతదేహాలను బయటకు తీశారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Also Read: స్టాలిన్ గారూ, ఇదేం పద్ధతండీ..?

మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో మరణించిన వ్యక్తులను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాదంపై మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందిస్తున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకునేందుకు స్థానిక అధికారులంతా ఆస్పత్రికి చేరుకుంటున్నారు. గని నుంచి బస్సును బయటకు తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బస్సు పడిపోయిన గని ప్రధాన రహదారి పక్కనే ఉంది. దీని లోతు 40 అడుగుల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ బస్సు ప్రమాదంపై భారత ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. దీంతో పాటు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో స్థానిక యంత్రాంగం బాధితులకు అన్ని విధాలా సాయం అందించడంలో నిమగ్నమై ఉందని ప్రధాని మోడీ సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ సాయి కూడా ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఎక్స్ లో దుర్గ్‌లోని కుమ్హారి సమీపంలో ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులతో నిండిన బస్సు ప్రమాదం గురించి సమాచారం అందింది. ఈ ప్రమాదంలో 14 మంది ఉద్యోగులు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రమాదంలో గాయపడిన ఉద్యోగులకు చికిత్స అందించేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని అన్నారు.

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే