Fake RS 500 Notes: దేశ వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేస్తూ కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనను బట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఇంతకు కేంద్రం జారీ చేసిన ఆ హెచ్చరిక ఏమిటి? దానిని మనం ఏవిధంగా ఎదుర్కోవాలో కూడా కేంద్రం ఓ క్లారిటీ ఇచ్చింది. మరి ఇక అసలు విషయంలోకి వెళితే..
దేశంలో అప్పుడప్పుడు ఫేక్ కరెన్సీ వ్యవహారం తెరపైకి వస్తుంది. అయితే మనం అప్రమత్తంగా ఉన్నప్పటికీ, ఫేక్ కరెన్సీ బారిన అప్పుడప్పుడు గురి అవుతూ ఇక్కట్లు పడ్డ పరిస్థితులు చూసి ఉంటాం. ఇప్పుడు మన దేశాన్ని అంతర్గతంగా దెబ్బతీసే వ్యవస్థలో ఫేక్ కరెన్సీ ఒకటి. అందుకే కేంద్రం సైతం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తోంది. మొన్నటి వరకు ఫేక్ కరెన్సీని గుర్తు పట్టేందుకు మనకు తక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఫేక్ గాళ్ళు మరీ తెలివి మీరి, ఫేక్ నోట్లను తెగ విడుదల చేస్తున్నారట.
కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు.. అధిక నాణ్యత గల నకిలీ రూ. 500 కరెన్సీ నోట్లు చెలామణిలోకి వచ్చాయట. అసలు నోట్లను పోలినట్లు ఉండడమే కాక, మనం నకిలీ నోట్ అంటూ కనుగొనే స్థాయికి మించిన నోట్లు చెలామణిలో ఉన్నాయట. తస్మాత్ జాగ్రత్త.. ఇలాంటి ఫేక్ నోట్లు మీ వద్ద ఉన్నాయేమో ఒక్కసారి చెక్ చేసుకోండి. లేకుంటే పెద్ద ఇబ్బందే అంటోంది కేంద్రం. ఇప్పటికే ఇలాంటి ఫేక్ కరెన్సీని చెలామణి చేసే ముఠా గుట్టురట్టు చేసేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలు ముందడుగు వేశాయి.
ఇంతకు ఫేక్ ను గుర్తించడం ఎలా?
ఫేక్ రూ. 500 కరెన్సీ నోట్లను ఎలా గుర్తించాలో కూడా కేంద్రం చెప్పింది. ఒరిజినల్ నోట్లకు తగినట్లుగా ఫేక్ నోట్లు కూడా మందాన్ని కలిగి ఉండగా, ఫేక్ నోట్లను మాత్రం ఇలా కనుక్కోవచ్చట. అదెలాగంటే.. నకిలీలు నిజమైన వాటితో పోలికను కలిగి ఉన్నప్పటికీ, RESERVE BANK OF INDIA అనే పదంలో స్పెల్లింగ్ తప్పుగా ఉంటుందట. అంతేకాదు కొన్ని నోట్లలో E స్థానంలో A అక్షరం కనిపిస్తుందని ప్రకటించారు.
Also Read: Indus Waters Treaty: పాకిస్తాన్ లో అమ్మో.. అయ్యో రేంజ్ కేకలే.. కారణం ఇదే
చాలా వరకు ఈ స్పెల్లింగ్ గమనించకుండానే, ఫేక్ కరెన్సీ నోట్లను ప్రజలు తీసుకోవద్దని, తప్పక నోట్ల మార్పిడి సమయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందట. అందుకే దేశ ప్రజలు ఇలాంటి ఫేక్ నోట్ల పట్ల తస్మాత్ జాగ్రత్త అంటోంది కేంద్రం. అమాయక ప్రజలను మోసం చేసేందుకు ఫేక్ గాళ్ళు సమాజంలో తిరుగుతూ ఉంటారని, అలాంటి వారు తారసపడితే స్థానిక పోలీసులకు గానీ, బ్యాంక్ అధికారులకు గానీ సమాచారం ఇవ్వాలని కేంద్రం సూచించింది. అందుకే తస్మాత్ జాగ్రత్త.. ఫేక్ కరెన్సీ తీసుకోవద్దు.. రూ. 500 కరెన్సీ నోటు చెక్ చేసే తీసుకోండి సుమా!