Rly tickets online agent
జాతీయం

National:ఇకపై‘రైల్వే ఆన్ లైన్’అంత ఈజీ కాదు

Central Government orders to book the railway tickets through Official Agents:

ఒకప్పుడు రైలు ఎక్కాలంటే స్టేషన్ కు వెళ్లి టిక్కెట్ కొనాల్సిందే. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇంట్లోనే దర్జాగా కూర్చుని ఎంచక్కా ఆన్ లైన్ టిక్కెట్లను బుక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. ఐఆర్ సీటీసీ సిస్టమ్ ద్వారా మనకు టిక్కెట్ల బుకింగ్ చేసుకునే ఆన్ లైన్ సదుపాయంతో మరింతగా ఈజీ అయిపోయింది. దీంతో అక్రమాలు కూడా బాగానే పెరిగిపోయాయి. అందుకే రైల్వే టిక్కెట్ల బుకింగ్ పై కఠినమైనా ఆంక్షలు విధిస్తూ కేంద్రం ఓ నిర్ణయం తీసుకుంది. గతంలో మాదిరిగా కాకుండా రైల్వే టికెట్లకు సంబంధించిన వ్యవస్థను సమూలంగా మార్చేసింది. జనరల్ గా చాలా మంది ఐఆర్ సీటీసీలో లాగిన్ ఉంటుంది. దీంతో వారు ఎవ‌రికైనా టికెట్ల‌ను బుక్ చేసే స్తూ ఉంటారు. కొంద‌రు ఫ్రెండ్స్ కోసం.. మ‌రికొంద‌రు బంధువుల‌ కోసం కూడా.. టికెట్లు బుక్ చేస్తారు. అయితే.. ఇలా చేస్తున్న క్ర‌మంలో మోసాలు జ‌రుగుతున్నాయ‌ని రైల్వే శాఖ గుర్తించింది. పైగా ప‌న్నులు కూడా వ‌సూలు కావ‌డం లేద‌ని భావించింది.

లైసెన్స్ ఏజెంట్ ద్వారానే..

మోసాలను అరికట్టే ప్రక్రియలో భాగంగా థ‌ర్డ్ పార్టీ అంటే.. ర‌క్త‌సంబంధీకులు కాని వారికి ఎవ‌రు బ‌డితే వారు.. టికెట్లు బుక్ చేసుకునేందుకు నిషేధం విధించింది. కేవ‌లం రైల్వే శాఖ నుంచి లైసెన్సు తీసుకున్న ఏజెంటు ద్వారా మాత్ర‌మే ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని రైల్వే శాఖ స్ప‌ష్టం చేసింది.. ఇలా కాకుండా.. ఎవ‌రికిబ‌డితే వారికి టికెట్లు బుక్ చేస్తే.. వాటిని ర‌ద్దు చేయ‌డంతోపాటు.. బుక్ చేసిన వారికి రూ.10 వేల జ‌రిమానా మూడేళ్ల జైలు రెండూ ఏక‌కాలంలో విధిస్తామ‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించింది. దీనివ‌ల్ల రైల్వే శాఖ‌కు ఆదాయంతోపాటు.. నిబంధ‌న‌ల ప్ర‌కారం టికెట్ల ప్ర‌క్రియ సాగుతుంద‌ని తెలిపింది.

Just In

01

Chamal Kiran Kumar: ఉద్యోగాల్లో కృత్రిమ మేధస్సు కీ రోల్.. ఎంపీ చామల కీలక వ్యాఖ్యలు

Peddi Update: రత్నవేలు ఇచ్చిన అప్డేట్‌తో రామ్ చరణ్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ!

Harish Rao: కవిత వ్యాఖ్యలపై.. తొలిసారి స్పందించిన హరీశ్‌ రావు

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?